వాట్సప్.. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్. దీనిలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైంది వాట్సప్ కాలింగ్. ఈ ఉచిత కాల్స్ మాట ఎలా ఉన్నా చాలాసార్లు కాలింగ్ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవతలి వ్యక్తి మాట వినబడకపోవడం.. లేకపోతే ఉన్నట్టుండి కట్ కావడం లాంటి ఇంకా చాలా సమస్యలు వాట్సప్ కాలింగ్‌లో ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యలు పరిష్కారాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ చదవండి..
డివైజ్ రిస్టార్ట్ చేయండి
వాట్సప్ కాలింగ్ ఇబ్బందిగా ఉంటే మన ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ డివైజ్‌ను రీస్టార్ట్ చేయడం ఒక ఆప్షన్. రీస్టార్ట్ లేకపోతే పవర్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాలి. లేకపోతే మీ రోటార్‌ను 20 సెకన్ల పాటు అన్‌ప్లగ్ చేసి మళ్లీ ప్లగ్ చేయాలి.
మంచి ఇంటర్నెట్ కనెక్షన్
మీకు మెరుగైన ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే వాట్సప్ కాలింగ్ చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కేవలం కాలింగ్ మాత్రమే కాదు మెసేజింగ్, వీడియోలు పంపడం కూడా కష్టం. అందుకే కనీసం 3జీ నెట్‌వర్క్ ఇంటర్నెట్‌ను వాడేలా ఏర్పాటు చేసుకోవాలి. మీరు మొబైల్ డేటాను యూజ్ చేస్తున్నట్లైతే బలమైన నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి. ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంటే వైఫై లేదా మొబైల్ డేటాను టర్న్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి.
స్విచ్ నెట్‌వర్క్
ఒక్కోసారి మీ నెట్‌వర్క్‌తోనే కాలింగ్, మెసేజింగ్ ఇబ్బందులు ఎదురువుతాయి. ఇలాంటి సందర్బాల్లో మీ నెట్‌వర్క్ ఆపరేటర్‌ని సంప్రదించాలి. పదే పదే ఈ సమస్యలు పునరావృతం అవుతుంటే వెంటనే వేరే నెట్‌వర్క్‌కు మార్చుకోవడం మంచిది. అదీ కూడా కనీసం 3జీ స్పీడ్ ఉండే మొబైల్ నెట్‌వర్క్‌కు మాత్రమే మారాలి.
అనేబుల్ ఏరోప్లేన్ మోడ్
కొన్ని సందర్భాల్లో ఏరోప్లేన్ మోడ్ మనకు ఎంతో సాయం చేస్తుంది. మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా పని చేస్తుంది. ఈ మోడ్‌ని నెట్‌వర్క్‌ని బాగా యూజ్ చేసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. నెట్‌వర్క్ ఇష్యూలను ఫిక్స్ చేసుకోవడం ద్వారా వాట్సప్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసేలా చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఏరో ప్లేన్ మోడ్ క్లిక్ చేయడం ద్వారా మీ నెట్‌వర్క్‌లో ఏమైనా సమస్యలు ఉన్నా సెట్ అయిపోతాయి. ఆ తర్వాత మళ్లీ నార్మల్ మోడ్‌లోకి వచ్చేయచ్చు.
డిజేబుల్ బ్యాటరీ సేవర్
బ్యాటరీ సేవర్ మోడ్ ఉపయోగించడం ద్వారా నెట్‌వర్క్ ఇబ్బందులను పరిష్కరించుకోవచ్చు. మీ బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ రన్ కాకుండా బ్యాటరీ సేవర్ మోడ్ యూజ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితితో వాట్సప్‌ను ఎక్స్‌క్లూడ్ చేయడం ద్వారా ఈ యాప్‌ను మాత్రమే బాగా పని చేసేలా చేసుకోవచ్చు. బ్యాటరీ సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లితే మీకు డిజేబుల్ బ్యాటరీ సేవర్ కనిపిస్తుంది.