ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సప్ ఇకపై తన స్టేటస్‌లో ప్రకటనలకు అనుమతించేందుకు సర్వం సిద్ధం చేసింది. 2020 నాటికి స్టేటస్ స్టోరీస్ యాడ్స్‌ను తీసుకు రానున్నామని ప్రకటించింది. నెదర్లాండ్స్‌లో జరిగిన మార్కెటింగ్ సదస్సుకు హాజరైన ఆలివర్ పొంటోవిల్లే ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆండ్రాయిడ్ 2.18.305 బీటా వెర్షన్‌లో ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉంది. ఈ యాడ్స్‌ని ఫేస్‌బుక్‌కు చెందిన అడ్వర్టైజింగ్ వ్యవస్థే నడిపించనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ప్రతి ఒక్క యూజర్ స్టేటస్ మీద ఇకపై కంపెనీల యాడ్స్ ప్రమోట్ అవుతాయి.
గత ఏడాది అక్టోబర్‌లోనే వాట్సప్ ప్రకటనలపై వార్తలు మార్కెట్ వర్గాల్లో హల్ చల్ చేశాయి..అయితే వాట్సప్ ఈ వార్తలను తాజాగా ధృవీకరించింది. స్టేటస్‌లో యాడ్స్ చూపించ బోతున్నాం. వాట్సప్ ద్వారా స్థానిక వ్యాపారాలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రైమరీ మానెటైజేషన్ మోడ్‌లో యాడ్స్ ఉండబోతున్నాయని వాట్సప్ ప్రతినిధి వెల్లడించారు. వాట్సప్‌లోని "స్టేటస్" విభాగంలో ప్రకటనలు రాబోతున్నాయని తెలిపింది. ఇకపై వాట్సప్ స్టేటస్‌లలో అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించాలని మోచిస్తోంది. ఈ ప్రకటనలకు ఆదరణ బాగా లభిస్తుందనీ, తద్వారా వ్యాపార సంస్థలకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని వాట్సప్ భావిస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ యూజర్ల సంఖ్య 1.5 బిలియన్లకు చేరుకుంది. భారత్‌లో వీరి సంఖ్య 250 మిలియన్లుగా ఉంది.
ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్ లో యాడ్స్ డిస్ ప్లే అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాడ్స్ మనం చూస్తూనే ఉన్నాం.ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసిన యాప్స్ లో యాడ్స్ డిస్ ప్లే అవుతుంటాయి. వీటి సరసన వాట్సప్ కూడా చేరింది. వాట్సప్ ప్లాట్ ఫాంపై యాడ్స్ సర్వ్ చేయడం ఎంతవరకు సాధ్యం అనేదానిపై ఫేస్ బుక్ సీఈఓ జూకర్ బర్గ్ సహా ఇతర వ్యవస్థాపకులు చర్చలు జరిపినట్టు అప్పట్లో వార్తలు వచ్చని సంగతి తెలిసిందే.ఆ చర్చల ఒప్పందం కుదరకపోవడంతో సదరు కంపెనీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు వాట్సప్ లో యాడ్స్ సర్వ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. 2020 నుంచి యూజర్లు.. తమ ఫేవరెట్ వాట్సప్ మెసేంజర్ పై పెస్కీ యాడ్స్ క్లౌడింగ్ చూడవచ్చు. ఈ యాడ్స్.. ఫొటోగ్రాఫ్ స్లైడ్లతో కూడిన యాడ్స్ డిసిప్లే కానున్నాయి. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో వాట్సప్ స్టేటస్ పై కూడా యాడ్స్ కనిపించనున్నాయి.
ఆ యాడ్ ఇమేజ్ పై క్లిక్ చేయగానే వాట్సప్ ఎంటైర్ స్ర్కీన్ పై డిస్ ప్లే అవుతుంది. షేర్ టెక్స్ట్ , ఫొటోలు, వీడియోలు, యానిమేటెడ్ GIF ఇమేజ్ లను కంపెనీలు షేర్ చేసేందుకు యాడ్స్ ద్వారా అనుమతి ఉంటుంది. కానీ, ఈ యాడ్స్ 24 గంటల తర్వాత అదృశ్యమైపోతాయి.యాడ్ ఇచ్చిన కంపెనీ పేరును కూడా యూజర్లు చూడొచ్చు. వాట్సప్ చాట్ విండోస్ పై డిస్ ప్లే యాడ్స్ ను అవైడ్ చేసే అవకాశం కూడా ఉంది. యాడ్స్ పై కచ్చితంగా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు.
ఏళ్ల తరబడి వాట్సాప్ వాడుతున్న యూజర్లకు సడన్ గా యాడ్స్ డిస్ ప్లే కావడం ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. వాట్సప్ యాడ్ ఫీచర్ పై ఓ సోషల్ మీడియా ఇండస్ట్రీ కామెంటేటర్ ట్వీట్ చేశారు. బిజినెస్ యాప్ లో రిచర్ మెసేజింగ్ ఫార్మాట్ ఆప్షన్ ప్రవేశపెట్టనున్నారు. ఫేస్ బుక్ బిజినెస్ మేనేజర్ క్యాట్ లాగ్ తో వాట్సప్ ప్రొడక్ట్ క్యాట్ లాగ్ ను ఇంటిగ్రేటడ్ చేయనున్నారని ట్వీట్ లో తెలిపారు.