సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేసింది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకోసం తీసుకురాబోతోంది. ఇకపై వాట్సప్‌లో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని ఆటోమేటిగ్గా అదృశ్యమైపోయేలా చేసుకోవచ్చు. కాగా వాట్సప్‌లో ఇప్పటికే మనం పంపే మెసేజ్‌లను డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అలా డిలీట్ చేయకుండా వన్ అవర్ తరువాత వాతంతట అవే డిలీట్ అయిపోతాయి. ఇందుకోసం యూజర్లు వాట్సప్‌లోని సెట్టింగ్స్ విభాగంలో అందజేసే డిసప్పియరింగ్ మెసేజెస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. అతి త్వరలోనే వాట్సప్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.
దీంతో పాటుగా వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం ముందుగా మీరు సంబంధిత నెంబర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ నెంబర్‌ను బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీకు వాట్సప్‌లో బ్యాంకు నుంచి వెల్‌కమ్ టెక్స్‌ట్ మెసేజ్ వస్తుంది. మీరు ఆ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. తరువాత ఏదైనా బ్యాంక్ సర్వీస్ పొందాలనుకుంటే ముందుగా ‘Hi’ అని టైప్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని బట్టి మెసేజెస్ పంపాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ను కొన్ని బ్యాంకులు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. Kotak Mahindra Bank, Saraswat Bank, HDFC Bank, AU Small Finance Bank వంటి బ్యాంకులు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి.
ఇక బ్యాకింగ్ లావాదేవీలు నడిపే మీ ఫోన్ పోతే వెంటనే “Lost/Stolen: Please deactivate my account" అని టైప్ చేసి support@whatsapp.com ఇమెయిల్ ఐడీకి మెయిల్ పంపండి. ఇందులో కంట్రీకోడ్‌తో కలిపి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ 10 అంకెల ఫోన్ నెంబర్ ముందు కంట్రీ కోడ్ +91 తప్పనిసరిగా ఉండాలి. మీరు మెయిల్ పంపిన వెంటనే మీ వాట్సప్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. లేదా మీరు వెంటనే కొత్త సిమ్ తీసుకొని, కొత్త ఫోన్‌లో వాట్సప్ యాక్టివేట్ చేయాలి. దీంతో పోగొట్టుకున్న ఫోన్‌లో వాట్సప్ డీయాక్టివేట్ అవుతుంది.