ఇండియాలో ఇప్పటికే స్మార్ట్ డివైస్‌ల హవా మొదలైంది. అందులో భాగంగానే స్మార్ట్ స్పీకర్లు తెరమీదకి వచ్చాయి. గూగుల్ నెస్ట్, అమెజాన్ ఎకో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు వాటికి పోటీగా యాపిల్ కూడా రంగంలోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్ స్పీకర్ యాపిల్ డివైస్‌లకు మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా పని చేస్తుంది. దాని విశేషాలివిగో..
1. యాపిల్ స్మార్ట్ స్పీకర్‌కు యాపిల్ హోం పాడ్ అని పేరు పెట్టింది.
2. ఇది ఆండ్రాయిడ్ డివైస్‌లకు పని చేయదు. ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ యాపిల్ యూజర్స్.
3. హోం ప్యాడ్‌లో ఆటోమేటిక్ రూమ్ సెన్సింగ్ టెక్నాలజీ ఉంది. దీన్ని మీరు రూమ్‌లో పెట్టారా, కార్నర్‌లో ఉంచారా, టేబుల్ మీద పెట్టారా, బుక్ షెల్ఫ్‌లో అమర్చరా అనేది ఈ టెక్నాలజీతో గుర్తించి దానికనుగుణంగా సౌండ్‌ను ఇస్తుంది.
4. వైట్, స్పేస్ గ్రే రంగుల్లో దొరుకుతుంది. స్పీకర్ చుట్టూ రక్షణగా మెస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది.
5. ఇందులో 6 మైక్రో స్పీకర్‌లు ఉన్నాయి. రూమ్‌లో ఉన్న సౌండ్‌ను గ్రహించడానికి ఇవి ఉపయోగపడతాయి.
6. సౌండ్ అవుట్‌పుట్ కోసం కస్టమైజ్డ్ యాంప్లిఫైర్, ఒక ఊఫర్, 7 ట్వీటర్లు అమర్చారు.
7. యాపిల్ ఏఐ బేస్డ్ వాయిస్ అసిస్టెంట్ సిరితో ఈ యాపిల్ హోం పాడ్ పని చేస్తుంది. దీంతో ఇది మీ ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తుంది. కమాండ్స్ స్వీకరిస్తుంది.
8. ఇందులో ఉన్న ఏ8 చిప్ హోం పాడ్ యాక్షన్స్‌కు క్లిక్ చేస్తుంది.
9 ఫ్లిప్‌కార్ట్, పేటీఎంతోపాటు యాపిల్ ఆథరైజ్ఢ్ డీలర్ల దగ్గర దొరుకతుంది.
10. ధర 19,900 రూపాయలు