చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇండియన్ టీవీ మార్కెట్ మీద గట్టిగానే దృష్టి పెట్టాయి. ఎంఐ స్మార్ట్ టీవీలు క్లిక్కవడంతో మరో చైనా కంపెనీ రియల్‌మీ కూడా అదే దారిలో వెళుతుంది. ఇప్పటికే 32, 43 ఇంచెస్ స్మార్ట్ టీవీలు రిలీజ్ చేసిన రియల్‌మీ త్వరలో 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
అవి రెండూ అవుటాఫ్ స్టాక్
రియల్‌మీ ఇప్పటికే 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌టీవీని రూ. 12,999 ధరతోనూ, 43 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్‌టీవీని రూ. 21,999 ధరతోనూ రెండు వారాల కిందట ఇండియన్ మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఎంఐ.కామ్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ వీటిని అమ్మకానికి పెట్టింది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు ఉండటంతో ఈ టీవీలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. అమ్మకాలు ప్రారంభించిన పది నిమిషాల్లోనే ఇవి అవుటాప్ స్టాక్ అయ్యాయని కంపెనీ ప్రకటించింది.
ఆ ఉత్సాహంతో ఇప్పుడు 55 ఇంచెస్ టీవీ
రియల్‌మీ 32, 43 ఇంచెస్ స్మార్ట్‌టీవీలు క్షణాల్లో అమ్ముడవడంతో ఆ సంస్థ మరింత ఉత్సాహంగా 55 అంగుళాల స్మార్ట్‌టీవీని రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. త్వరలో 55 అంగుళాల స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు రియల్‌మీ సీఈవో మాధవ్ సేథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇందులో ప్రీమియం, ఫ్లాగ్‌షిప్ అనే రెండు వెర్షన్లు ఉంటాయని చెప్పారు.