ఒప్పో సబ్‌బ్రాండ్‌గా వచ్చిన రియల్‌మీ స్మార్ట్ ఫోన్ల విషయంలో పరవాలేదనిపించుకుంది. ఇప్పుడు ఇతర వేరియబుల్స్ మార్కెట్ మీద దృష్టి పెట్టింది. ఫిట్‌నెస్ ట్రాకర్ వాచ్‌లకు ఉన్న మార్కెట్‌ను గమనించి ఆ ప్రొడక్ట్‌ను లాంచ్ చేయబోతోంది. రియల్‌మీ నుంచి రాబోతున్న తొలి ఫిట్‌నెస్ ట్రాకర్ వాచ్ ఎలా ఉండబోతోందో చూద్దాం
ఇవీ ఫీచర్లు
* ప్లాస్టిక్ బాడీ
* ఫుల్ కలర్ డిస్‌ప్లే
* లాక్ అన్ అండ్ లాక్‌కు ఫిజికల్ బటన్ కూడా ఇచ్చారు.
* వాటర్, డస్ట్ రెసిస్టెంట్
* బ్లూ టూత్ 5.0 వెర్షన్
* 5 రకాల క్లాక్ ఆప్షన్స్
వారం రోజుల బ్యాటరీ
160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు వారం రోజులపాటు పనిచేస్తుంది. హార్ట్ రేటర్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సర్, యాక్సిలరేటర్ సెన్సర్ ఉన్నాయి.
వీటిని మెజర్ చేస్తుంది
* మీ నడక
* హార్ట్‌రేట్
* మెడిటేట్
* ఎక్సర్‌సైజ్: వాకింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, క్రికెట్, టీటీ, వాలీబాల్, బాస్కెట్‌బాల్ ఇలాంటి 15 రకాల ఎక్సర్‌సైజ్‌లను ట్రాక్ చేయగలదు.
* ఆక్సిజన్
ఇతర ఆప్షన్లు
మ్యూజిక్ కంట్రోల్, అలారమ్, స్టాప్‌వాచ్ ఉన్నాయి. మీ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసి దాని కెమెరాను ఈ వాచ్ ద్వారా రిమోట్ పద్ధతిలో కూడా ఓపెన్ చేయొచ్చు. మీరు ఎక్కువసేపు కదలకుండా కూర్చున్నా, చాలాసేపటి వరకు నీళ్లు తాగకుండా ఉండిపోయినా ఈ రియల్‌మీ వాచ్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఇందుకోసం మీరు ముందుగానే అలారం సెట్ చేసి పెట్టుకుంటే చాలు. ఆ టైమ్ రాగానే రెగ్యులర్‌గా మిమ్మల్ని అప్‌డేట్ చేస్తుంది.
సొంత ఓఎస్
ఇతర స్మార్ట్‌వాచ్‌ల్లా రియల్‌మీ ఆపరేటింగ్ సిస్టం కోసం గూగుల్‌పై ఆధారపడలేదు. తన సొంత ఓఎస్‌తో దీన్ని తయారుచేసింది.
ధర 3 నుంచి 4వేలలోపే
ఇండియాలో స్మార్ట్‌వాచ్‌లమ్మే కంపెనీలు తక్కువేమీ లేవు. కాకపోతే ప్రైస్ ఎక్కువగా ఉంటోంది. తక్కువ ప్రైస్‌లో ఉన్నవాటిలో ఫీచర్లు తక్కువ, కానీ రియల్‌మీ వాచ్‌లో ఫీచర్లు బాగున్నాయి. ధర కూడా ఇండియన్ మార్కెట్‌ను ఆకట్టుకునేలా 3నుంచి 4వేల రూపాయల్లోపే ఉండొచ్చని అంచనా.