మోటరోలా కంపెనీ నుంచి చాలా ఫోన్‌లు మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ 'మోటో జీ' ఆవిర్భావం తరువాత దూసుకుపోయింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉన్న బ్రాండ్‌లకే అదనపు హంగులు జోడిస్తూ తనకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకుంది. కానీ, మార్కెట్‌లో వస్తున్న కొత్త రకాల ఫోన్‌ల పోటీ ముందు ఎప్పటికప్పుడు వెనకబడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మోటరోలా ఒక ప్రయోగానికి పూనుకుంటోంది. మోటో ఎక్స్ సీరిస్ నుంచి 'మోటో బై లెనోవా' పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ప్రుస్తుతం ఏక్కువ జీబీ ర్యామ్‌కు ప్రాధాన్యతనిస్తున్న తరుణంలో 'మోటో బై లెనోవా' ఫోన్ 4జీబీ ర్యామ్, 5 అంగులాల తెరతో రానుంది. కాకపోతే ప్రతిఫోన్‌లో ఏదో ఒక లోపం ఉన్నట్లు ఇందులో కూడా ఒక ప్రధానా లోపం ఉన్నట్లు తెలిసింది. కేవలం సింగిల్ సిమ్‌ను మాత్రమే సఫోర్ట్ చేయనుంది. ప్రస్తుతం ప్రతి ఒక్క వినియోగదారుడు సాధ్యమైనంత వరకు రెండు సిమ్‌లను వాడుతున్నారు. ఈ తరుణంలో ఒకే సిమ్‌తో ఈ ఫోన్‌ను విడుదల చేయడం విశేషం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మోటరోలా ఫోన్లు మోటో సెకండ్, తర్డ్ జనరేషన్‌తో పాటు మోటో టర్బో, మోటో ఎక్ప్‌ఫోర్స్, తాజాగా విడుదల చేసిన 'మోటో ఎక్స్ ఫోర్స్' వంటి ఫోన్లు వినియోగదారులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. మరి సింగల్ సిమ్ సఫోర్ట్‌తో రానున్న 'మోటో బై లెనోవా' వినియోగదారులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. |