నేటి గాడ్జెట్ మార్కెట్ లో వివిధ ధరలలో అనేక రకాల లాప్ టాప్ లు లభిస్తున్నాయి. మీ దగ్గర పరిమితమైన బడ్జెట్ ఉన్నా సరే ఏ మాత్రం దిగులు అవసరం లేదు, మీ బడ్జెట్ ధరలో లభించే లాప్ టాప్ లు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. రూ 20,000/- లోపు ధరలోనే మీకు అత్యుత్తమ లాప్ టాప్ లు లభించనున్నాయి. ఇవి ఏమంత పవర్ ఫుల్ కాకపోవచ్చు కానీ మీ ఆఫీస్ వర్క్ మరియు ఇతర పనులను చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రూ 20,000/- ల లోపు ఉండే లాప్ టాప్ లను నెట్ బుక్స్ అని కూడా అంటారు. మైక్రో సాఫ్ట్ ఆఫీస్ ఉపయోగించే వారికీ, ఈ మెయిల్ చెకింగ్ కూ, వెబ్ సర్ఫింగ్ కూ, పేస్ బుక్ మరియు ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ఉపయోగానికీ , మూవీ లను చూడడానికీ కొన్ని కొన్ని గేమ్ లను ఆడడానికీ ఈ తక్కువ ధర లో లభించే లాప్ టాప్ లు బాగా ఉపయోగపడతాయి. ఇవి మంచి బాటరీ లైఫ్ ను ఇస్తాయి. అలాంటివాటిలో కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం ఆసస్ ఈ బుక్ సెలేరోన్ ఇది ఇంటెల్ సెలేరోన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో పవర్ చేయబడి ఉంటుంది. విండోస్ 10 పై రన్ అవుతూ 2 GB RAM, 500 GB HDD ని కలిగిఉంటుంది. ఇది 11.6 అంగుళాల నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. HDMI, వై ఫై మరియు బ్లూ టూత్ లు దీని ఇతర ఫీచర్ లు. ఇది 3 సెల్ బాటరీ ని కలిగిఉంటుంది. దీని ధర రూ 18,999/- లు ఉంటుంది. ఆసస్ ఈ బుక్ ఆటం ఇది ఇంటెల్ ఆటం ప్రాసెసర్ తో పవర్ చేయబడి 64 బిట్ తో నడిచే విండోస్ 10 పై పనిచేస్తుంది. 11.6 ఇంచ్ నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ను కలిగిఉంటుంది. ఇది 2GB RAM మరియు 32 GB EMMC ని కలిగిఉంటుంది. HDMI, వైఫై, బ్లూ టూత్ లు దీని ఇతర ఫీచర్ లు. దీని బాటరీ 13 గంటల పాటు పనిచేస్తుంది. ఈ ఆసస్ ఈ బుక్ ఆటం ధర రూ 14,990/- లు ఉంటుంది. మైక్రో మాక్స్ కాన్వాస్ లాప్ టాప్ II ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లే లో లభిస్తుంది. దీనిని మీరు టాబ్లెట్ లాగా ఉపయోగించుకోవచ్చు, కీ బోర్డు అటాచ్ చేసి లాప్ టాప్ లాగా మార్చి ఉపయోగించవచ్చు. ఇది బిల్ట్ ఇన్ వైఫై మరియు 3 జి తో లభిస్తుంది. ఇది 4 వ జనరేషన్ ఇంటెల్ ఆటం ప్రాసెసర్ తో పవర్ చేయబడి విండోస్ 10 పై రన్ అవుతుంది. 11.6 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. 2 GB RAM మరియు 32 GB ROM ను కలిగి ఉంటుంది. దీనికి ఉన్న 9000 mAh బాటరీ 8 గంటల పాటు పనిచేస్తుంది. దీని ధర రూ 12,999/- లు ఉంటుంది. ఏసర్ ES 11 ఇది ఇంటెల్ సెలేరోన్ డ్యూయల్ కోర్ ఫోర్త్ జనరేషన్ ప్రాసెసర్ తో పవర్ చేయబడి ఉంటుంది. విండోస్ 10 పై రన్ అవుతుంది. 2 GB RAM మరియు 500 GB HDD ని కలిగి ఉంటుంది. RJ45, HDMI, వైఫై, మరియు బ్లూ టూత్ లు దీని ఇతర ఫీచర్ లు. దీని బాటరీ 5.5 గంటల బ్యాక్ అప్ ను ఇస్తుంది. దీని ధర రూ 16,990/- లు ఉంటుంది. లెనోవా ఐడియా పాడ్ 100 ఇది DOS ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. ఇది 4 GB RAM మరియు 500 GB HDD తో లభిస్తుంది. 14 ఇంచ్ నాన్ టచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. పెంటియం క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పవర్ చేయబడి ఉంటుంది. HDMI, వై ఫై మరియు బ్లూ టూత్ లు ఇతర ఫీచర్ లు. దీని బాటరీ 4 గంటల పాటు పనిచేస్తుంది. లెనోవా ఐడియా పాడ్ 100 యొక్క ధర రూ 19,990/- లు ఉంటుంది. ఏసర్ వన్ 10 ఆటం ఇది ఇంటెల్ ఆటం 5 వ జనరేషన్ ప్రాసెసర్ తో పవర్ చేయబడింది. 10.1 ఇంచ్ డిస్ప్లే తో లభిస్తుంది. 2 GB RAM మరియు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగిఉండి 32 బిట్ విండోస్ 10 పై నడుస్తుంది. దీని కీ బోర్డు ను తీసివేసి దీనిని టాబ్లెట్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో బిల్ట్ ఇన్ వైఫై మరియు బ్లూ టూత్ లు ఉంటాయి. దీని బాటరీ 6 గంటల పాటు వస్తుంది. ఈ ఏసర్ వన్ 10 ఆటం యొక్క ధర రూ 13,990/- లు ఉంటుంది. ఏసర్ E 15 ఇది డ్యూయల్ కోర్ ఫోర్త్ జనరేషన్ లాప్ టాప్. 2 GB RAM మరియు 500 GB HDD లో లభిస్తుంది. ఇది విండోస్ OS లో లభించదు. DOS ఆపరేటింగ్ సిస్టం లో ఉంటుంది. 15.6 ఇంచ్ నాన్ టచ్ స్క్రీన్, HDMI పోర్ట్, వైఫై,బ్లూ టూత్, CD/DVD రైటర్ మరియు ఎతర్ నెట్ లు దీని ఇతర ఫీచర్ లు. దీని బాటరీ 5.5 గంటల పాటు వస్తుంది. ఈ ఏసర్ E15 యొక్క ధర రూ 14,990/- లు ఉంటుంది. i బాల్ ఎక్సెలెన్స్ ఇది ఇంటెల్ ఆటం పవర్డ్ లాప్ టాప్. 32 బిట్ విండోస్ 10 పై పనిచేస్తుంది. 11.6 ఇంచ్ నాన్ టచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. 2 GB RAM మరియు 32 GB EMMC ని కలిగిఉంటుంది. HDMI, బ్లూ టూత్ మరియు వై ఫై లు దీని ఇతర ఫీచర్ లు. ఇది 7 గంటల బాటరీ లైఫ్ ను ఇస్తుంది. దీని ధర కేవలం రూ 9,999/- లు ఉంటుంది. |