• తాజా వార్తలు

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్ ట్రాక‌ర్‌లా, మీ మొబైల్ స‌పోర్టింగ్ డివైస్‌లా మ‌ల్టీ టాస్కింగ్ డివైస్‌గా ప‌ని చేసేందుకు మార్కెట్లో ఇప్పుడు బోల్డ‌న్ని ర‌కాల స్మార్ట్‌వాచ్‌లు వ‌చ్చేశాయి. అంతేకాదు ఒక‌ప్పుడు 30, 40 వేల రూపాయ‌లు పెడితే గానీ స్మార్ట్‌వాచ్ దొరికేది కాదు. ఇప్పుడు 3, 4వేల నుంచి కొనుక్కోవ‌చ్చు. అలా 5వేల రూపాయ‌ల ధ‌ర‌లో మంచి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన కొన్ని స్మార్ట్‌వాచ్‌ల వివ‌రాలు మీకోసం.. 


నాయిస్‌ కలర్‌ఫిట్ అల్ట్రా (Noise Colourfit Ultra)
నాయిస్ కంపెనీ కలర్‌ఫిట్ అల్ట్రా పేరుతో ఇటీవ‌లే ఓ స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది. 
* ఇందులో 60 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు, 100 వాచ్‌ ఫేస్‌లు ఉన్నాయి. 
* ఐపీ68 రేటింగ్‌ వాటర్‌ప్రూఫ్  
* హార్ట్‌రేట్ మానిట‌ర్,  స్లీప్ మానిట‌ర్‌, స్ట్రెస్‌ మానిటర్‌ 
* ల‌భించే రంగులు: గన్‌మెటల్ గ్రే, క్లౌడ్ గ్రే, స్పేస్ బ్లూ  
* ధ‌ర‌: రూ. 4,499 

బోట్ వాచ్ ఎక్స్‌టెండ్ (Boat Watch Xtend)
బోట్ కంపెనీ తీసుకొచ్చిన ఈ వాచ్‌లో 1.69-అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. 300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 7 రోజులపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది.  
* అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్ సపోర్ట్ దీని హైలెట్‌.  
* ఇందులో 14 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు, 50 వాచ్‌ ఫేస్‌లు ఉన్నాయి. 
*5 ఏటీఎం వాట‌ర్ రెసిస్టెన్స్ ఉంది.  ఒకవేళ వాచ్‌ 50మీటర్ల లోతు నీటిలో పడి తడిచినా పాడవదు. 
* హార్ట్‌రేట్ సెన్స‌ర్‌, ఎస్ఈఓ2,  స్ట్రెస్‌ మానిటర్ ఉన్నాయి.
* ల‌భించే రంగులు: పిచ్ బ్లాక్‌, డీప్ బ్లూ, ఆలీవ్ గ్రీన్, సాండీ క్రీమ్ 
* ధ‌ర‌: రూ. 3,499. అమెజాన్‌ లేదా బోట్ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చెయ్యొచ్చు.  

రెడ్‌మీ వాచ్‌ జీపీఎస్‌ (Redmi Watch GPS)
ఈ వాచ్‌లో 1.4-అంగుళాల ఫుల్ టచ్‌ కలర్ డిస్‌ప్లే ఉంది. ఇందులోని 230 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 రోజులపాటు ప‌ని చేస్తుంది. 
* ఇందులో 11 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు,200 వాచ్‌ ఫేస్‌లు ఉన్నాయి. 
*5 ఏటీఎం వాట‌ర్ రెసిస్టెన్స్ ఉంది.  ఒకవేళ వాచ్‌ 50మీటర్ల లోతు నీటిలో పడి తడిచినా పాడవదు. 
* హార్ట్‌రేట్ సెన్స‌ర్‌, స్లీప్ మానిట‌రింగ్ ఫీచ‌ర్లు 
*  బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్  చేసేందుకు ప్రత్యేకంగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ గైడ్ ఫీచర్   
* జీపీఎస్, అడ్వాన్స్‌డ్ హెల్త్‌ ట్రాకింగ్ ఫీచర్లు  
* ఫోన్‌ కాల్స్‌, నోటిఫికేషన్స్ అలారమ్, మ్యూజిక్ కంట్రోల్, ఫైండ్ మై ఫోన్ వంటి ఫీచర్లు  
* ల‌భించే రంగులు: ఐవోరి, బ్లాక్‌, బ్లూ 
* ధ‌ర‌: రూ. 3,999. 


నాయిస్‌ కలర్‌ఫిట్ ప్రో 3 (Noise ColourFit Pro 3)
* ఈ వాచ్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ఫిమేల్ హెల్త్‌ ట్రాకింగ్ ఫీచర్ ఉంది. 
* 210 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒక‌సారి ఛార్జ్ చేస్తే 10 రోజులపాటు పనిచేస్తుంది.  
* 1.55-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ 
* 14 రకాల స్పోర్ట్స్ మోడ్స్  . యూజర్‌కి నచ్చినట్లుగా మార్చుకునేలా క్లౌడ్ వాచ్‌ ఫేస్‌లు 
* ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. 
*  వాటర్‌ రెసిస్టెన్స్, హార్ట్‌రేట్, ఎస్‌పీఓ2, స్లీప్ మానిటర్ ఫీచర్స్  
* ల‌భించే రంగులు: స్మోక్ గ్రే, జెట్ బ్లూ, స్మోక్ గ్రీన్‌, రోస్‌ పింక్‌, జెట్ బ్లాక్‌, రోస్ రెడ్ 
* ధర:  రూ. 4,499 

క్రాస్‌బీట్స్‌ ఇగ్నైట్‌ (Crossbeats Ignite)
1.4-అంగుళాల హై డెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే 
*  5 రకాల వాచ్‌ ఫేస్‌లు . 6 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌
*180 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల పాటు పనిచేస్తుంది. 
* సోషల్‌ మీడియా యాక్టివిటీ, కాల్‌ నోటిఫికేషన్, మెసేజ్‌ అలర్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 
* ఐపీ68తో వాటర్, డస్ట్ ప్రొటెక్ష‌న్ 
* యూజ‌ర్ ఆరోగ్య‌ సమాచారాన్ని సీబీ ఎక్స్‌ప్లోర్ అనే యాప్‌ సాయంతో ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. 
* ధ‌ర‌: ప్యూర్ బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌ ధర రూ. 2,999. డిసర్ట్ గోల్డ్ వేరియంట్ ధర రూ. 3,299.

జన రంజకమైన వార్తలు