పండుగ దగ్గరకు వచ్చేస్తుంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇల్లు ఇంకా శుభ్రం చేయలేదు. ఇల్లు కడగాలి, తుడవాలి, బూజు దులపాలి,శుభ్రం చేయాలి, ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఇవన్నీ చేయాలంటే టైం సరిపోదు. ఒక్కళ్ళమే చేసుకోలేము. ఇటు చూస్తే పండగ మరెన్నో రోజులు లేదు. ఇంకా చాలా పనులు చేసుకోవాలి. ఇప్పుడెలా? అని దిగులు పడుతున్నారా? ఏం భయం అవసరం లేదు. ఇక మీ దివాలీ ని ఆనందంగా జరుపుకోండి. మీ ఇంటి పనులన్నీ చేయడానికి కొన్ని యాప్ లు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇక మరేదైనా పని చూసుకుని ఇంటి పని మాత్రం ఈ యాప్ లకు వదిలేయండి. మీ ఇల్లు కడగడం, శుభ్రపరచడం లాంటి సర్వీస్ లన్నీ ఈ యాప్ లే అందిస్తాయి. అవును మీరు చదువుతున్నది నిజమే. మీ కోసం మీ ఇంటి పనులు చేసే యాప్ లు వచ్చేసాయి. మరెందుకు ఆలస్యం అవేంటో చూసేయండి. అర్బన్ క్లాప్ దివాలి క్లీనింగ్ మరియు పెయింటింగ్ కోసం ప్రొఫెషనల్ లను ఈ యాప్ మీకు అందిస్తుంది. అంటే ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే మంచి ప్రొఫెషనల్ పనివాళ్ళు వచ్చి మీ ఇంటిని చక్కగా శుభ్రం చేసి అందంగా దివాలీ పెయింటింగ్ కూడా వేసి వెళ్తారు అన్నమాట. మీ ఇంటి యొక్క సైజు ను బట్టి మరియు వీరి సర్వీస్ ఛార్జ్ రూ 2000/- ల నుండీ రూ 10,000/- వరకూ ఉంటుంది. ముందుగా ఈ యాప్ లో మీరు మీ ఫోన్ నంబర్ ను ఉపయోగించి రిజిస్టర్ చేసుకోవాలి. ఈ యాప్ మీ నంబర్ ను ప్రొఫెషనల్ వర్కర్ లకు అందిస్తుంది. వాళ్ళు మీకు ఫోన్ చేసి మీరు ఉండే ఏరియా అడ్రెస్ తదితర వివరాలను కనుక్కుంటారు. మీ ఇంటిని మొత్తం శుభ్రం చేయడం, కార్పెట్ వాక్యూమింగ్ చేయడం, సోఫా లు కర్టెన్ లు శుభ్రం చేయడం ఇలా ప్రతీ విషయం లోనూ చాలా జాగ్రత్తగా శుభ్రం చేసి మీ ఇంటికి పండగ కళ ను తీసుకువస్తారు. లోకల్ ఓయ్ మీ ఇంటి పనుల అవసరాలకు ప్రొఫెషనల్ లను అందించడం లో ఈ లోకల్ ఓయ్ అనే యాప్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు వీరికి కాల్ చేయవచ్చు లేదా వెబ్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు. వెంటనే వీరు వచ్చి మీ ఇంటిని శుభ్రం గా ఉంచడమే గాక మీ ఇంటిని మీకు నచ్చిన విధంగా సర్ది వెళ్తారు. ఈ ప్రొఫెషనల్ లను ఎంపిక చేసుకోవడం లో లోకల్ ఓయ్ చాలా జాగ్రత్త వహిస్తుంది. స్కిల్ టెస్ట్, నైతిక విలువల టెస్ట్, వారు వచ్చిన బ్యాక్ గ్రౌండ్ ను పరీక్షించడం ఇలా సుమారు 45 రకాల టెస్ట్ ల ద్వారా ఇది తన స్టాఫ్ ను నియమించుకుంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా ఆర్డర్ చేయవచ్చు. వీరు ఒక 2 BHK ఫ్లాట్ కు సుమారు రూ 3,500/- లు ఛార్జ్ చేస్తారు. క్లీనింగ్ పరికరాలు కూడా వారే తెచ్చుకుంటారు. కాబట్టి మీరు పండగ పూట రిలాక్స్ అవాలంటే ఒక్కసారి ఈ యాప్ ట్రై చేయండి. హౌస్ జాయ్ మీకు అందుబాటు ధరలో మీ ఇంటిని శుభ్రపరిచే ఒక వెబ్ బేస్డ్ సర్వీస్ ఈ యాప్. ఇది మీరు ఎప్పుడెప్పుడు ఏమేమి శుభ్రం చేసుకోవాలో రిమైండర్ లు కూడా అందిస్తుంది. దివాలీ క్లీనింగ్ తో పాటు పెస్ట్ కంట్రోల్, కార్పెంటరీ పెయింటింగ్, హోమ్ బ్యూటీ లాంటి ఇతర పనులు కూడా వీరు అందిస్తారు. ఒక పూర్తి స్థాయి ఇంటిని శుభ్రం చేయడానికి సుమారు రూ 4,500/- లు ఛార్జ్ చేస్తారు. టాస్క్ బాబ్ ఇది ఒక అద్భుతమైన యాప్. మీరు బుకింగ్ చేసుకున్న 90 నిమిషాలలో అంటే గంటన్నర లోనే ఇది తన సేవలను మీకు అందిస్తుంది. మీరు తొందరగా ఉన్నపుడు చివరి నిమిషం ప్లాన్ లను చేస్తున్నపుడు ఈ యాప్ మీకు బాగా ఉపయోగపడుతుంది.వెబ్ మరియు యాప్ ను ఉపయోగించి మీరు దీని సేవలను పొందవచ్చు. వీరు ఇంటి అణువణువూ శుభ్రం చేస్తారు. మూడు కిటికీలు, 5 ఫ్యాన్ లూ, ఒక బాల్కనీ క్లీనింగ్ కు వీరు రూ 1000/- లు ఛార్జ్ చేస్తారు. 1 BHK లేదా ఒక పూర్తి స్థాయి ఇంటికి వీరు రూ 3,500/- లుఇ ఛార్జ్ చేస్తారు. ఫిక్సీ పూణే మరియు అహ్మదాబాద్ నగరాలలో నివసించేవారికి ఈ యాప్ ఒక మంచి అవకాశం. ఒక సింగిల్ బెడ్ రూమ్ కి రూ 1100/- లు, బాత్ రూమ్ కి రూ 900/- మరియు కిచెన్ కు రూ 1100/- లు ఛార్జ్ చేస్తారు. ఒక 2 BHK ఫ్లాట్ ను ఒకసారి క్లీన్ చేయడానికి సుమారు రూ 5,900/- లు ఛార్జ్ చేస్తారు. ఇది నాలుగు వీక్లీ సెషన్ లలో కూడా తన సేవలను అందిస్తుంది. దానికి కూడా ఇదే ఛార్జ్ వసూలు చేస్తుంది. ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కార్పెంటరీ, ప్లంబింగ్, AC రిపేర్, ఎలక్ట్రికల్ పనులు, మొదలైన సర్వీస్ లను కూడా ఈ యాప్ అందిస్తుంది. Mr. రైట్ ఢిల్లీ, ఫరిదాబాద్, గుర్గావ్, ఘజియా బాడ్, ఇందిరా పురం సిటీ లలో ఉండే వారికి ఈ యప్ ఒక మంచి ఎంపిక. ఇది అత్యుత్తమ హోమ్ రిపేర్ ప్రొఫెషనల్ లను మీకు అందిస్తుంది. ఇంటి పనులకు సంబంధించి ఇది మొత్తం 15 రకాల సేవలను అందిస్తుంది. పెస్ట్ కంట్రోల్ దగ్గర నుండీ కంప్యూటర్ రిపేర్ దగ్గర వరకూ మొత్తం 15 రకాల సేవలను ఇది అందిస్తుంది. పూర్తి స్థాయి ఇంటి క్లీనింగ్ కు ఇది సుమారు రూ 3,500/- ల నుండీ రూ 5,000/- ల వరకూ ఛార్జ్ చేస్తుంది. |