ఈ రోజుల్లో వీడియో గేమ్స్ ఇష్టపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య వచ్చిన పబ్ జి ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో అది బ్యాన్ అయ్యే స్థితికి వచ్చింది. అయినప్పటికీ దానికి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఈ గేమ్ అంతా గన్స్‌తో షూటింగ్ లేదా కత్తులతో పోరాటాలు, విల్లు, బాణాలతో యుద్ధాలతోనే సాగుతుంది. ఇప్పుడు మరో గేమ్ మార్కెట్లోకి దూసుకువచ్చింది. దీనిలో కత్తులు, బాణాలు లాంటి ఉంటావు. మానవజాతి ఆవిర్భావం ఎలా జరిగిందనే దాని గురించి మాత్రమే ఇందులో ఉంటుంది. ఈ గేమ్ పేరే యాన్సెస్టర్స్: ది హ్యూమన్‌కైండ్ ఆడిస్సీ'' ప్రస్తుతం ఈ గేమ్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
గేమ్ డెవలపర్ యూబీ సాఫ్ట్‌కు చెందిన అస్సాస్సిన్స్ క్రీడ్ గేమ్స్ సృష్టికర్త ప్యాట్రిస్ డెజిలెట్స్ నుంచి ఈ గేమ్ బయటకు వచ్చింది. ప్యాట్రిస్ డెజిలెట్స్ 2014లోనే యూబీ సాఫ్ట్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పనాచె డిజిటల్ గేమ్స్ పేరిట ఓ స్టూడియోను ప్రారంభించాడు. ఆ స్టూడియోనే ''యాన్సెస్టర్స్: ది హ్యూమన్‌కైండ్ ఆడిస్సీ'' అనే గేమ్‌ను డెవలప్ చేసి విడుదల చేసింది. ఈ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ విండోస్ ప్లాట్‌ఫాంపైనే దీన్ని అందిస్తున్నారు. డిసెంబర్ వరకు ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులోకి తేనున్నారు.
ఆసక్తి ఉన్న యూజర్లు Ancestors: Humankind Odyssey గేమ్‌ను ఎపిక్‌గేమ్స్ (www.epicgames.com) ఆన్‌లైన్ స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మొదటి ఎపిసోడ్‌ను అందుబాటులో ఉంచారు. ఈ గేమ్ ధర 29.99 డాలర్లు (దాదాపుగా రూ.2153)గా ఉంది. ఇక గేమ్‌ను ఆడేందుకు windows pcలో కనీసం windows 7 స్పెషల్ 64 బిట్ ఓఎస్ లేదా windows 10 64బిట్ ఓఎస్ ఉండాలి. అలాగే ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 760 (4జీబీ), రేడియాన్ 7950 (3జీబీ), జిఫోర్స్ జీటీఎక్స్ 980 (4జీబీ), రేడియాన్ ఆర్‌ఎక్స్ 480 (8జీబీ) గ్రాఫిక్ కార్డులలో ఏదో ఒకటి ఉండాలి. ఇంటెల్ కోర్ ఐ5-2500కె, ఏఎండీ ఫీనమ్ 2 ఎక్స్6 1100టి, ఇంటెల్ కోర్ ఐ7-4770కె, ఏఎండీ రైజెన్ 5 1600 లలో ఏదో ఒక ప్రాసెసర్ ఉండాలి. అలాగే కనీసం 8జీబీ ర్యామ్ ఉండాలి.
Ancestors: Humankind Odyssey గేమ్ సెట్టింగ్ 10 మిలియన్ల సంవత్సరాల క్రితం వాటిో మిదలవుతుంది. ఆఫ్రికా ఖండంలో కోతి నుంచి మానవుడు ఆవిర్భవించాడని అనే అంశాల ప్రాతిపదికగా గేమ్ స్టోరీ నడుస్తుంది. ఇందులో వ్యక్తి కోణంలో కాకుండా ప్రత్యేక జాతికి చెందిన కోతుల నేపథ్యంలో గేమ్‌ను ఆడాల్సి ఉంటుంది. గేమ్‌లో ఉండే పలు ఆప్షన్లను ఉపయోగించుకుని యూజర్లు ముందుకు సాగాలి. ఈ గేమ్ పూర్తిగా ఓపెన్ వరల్డ్, అడ్వెంచర్, రోల్ ప్లేయింగ్ తరహాలో ఉంటుంది. 10 మిలియన్ల సంవత్సరాల కిందట అడవుల్లో పచ్చని ప్రకృతి ఎలా ఉంటుంది, ఏయే జీవరాశులు ఉంటాయో ఇందులో చూపించారు.
మానవజాతి మనుగడ మొత్తాన్ని ఇందులో చూపించారు. గేమ్ చివరి వరకు ఇదే కనిపిస్తుంది. దీంతో పాటు గేమ్ ఎండింగ్‌లో యూజర్లకు సర్‌ప్రైజ్ ఉంటుంది. అయితే అది గేమ్ ఆడిన తరువాతే తెలుస్తుందని కంపెనీ తెలిపింది.