• తాజా వార్తలు

ఆత్యంత చవకైన 4జి వోల్ట్ స్మార్ట్ ఫోన్ రూ.3999/-లకే అందిస్తున్న రిలయన్స్

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న మొబైల్‌బ్రాండ్‌లలో రిలయన్స్ ఎల్‌వైఎఫ్ ఒకటని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.  అతితక్కువ సమయంలోనే మార్కెట్లో 7% వాటా దక్కించుకున్న  ఎల్‌వైఎఫ్ దేశంలోని అగ్రగామి బ్రాండ్లలో 5వ స్థానంలోకి దూసుకువచ్చింది.  తమ 4జి జియో తో దేశంలోని స్మార్ట్‌ఫోన్- డేటా సర్వీస్ మార్కెట్లో అగ్రస్థానం దక్కించుకోవాలని తహతహలాడుతున్న రిలయన్స్ ఆ లక్ష్య సాధనలో భాగంగా అతి చౌకైన 4జి వోల్ట్ ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ఎల్‌వైఎఫ్-ఫ్లేమ్-౩ పేరుతో విడుదల చేస్తున్న ఈ ఫోన్ కేవలం హోమ్‍షాప్-18 వెబ్‍సైట్ ద్వారా  అమ్మకానికి ఉంచారు. భారతదేశంలోనే అతి చౌకైన 4జి వోల్ట్ ఫోన్ ఎల్‌వైఎఫ్-ఫ్లేమ్-౩ ఫీచర్స్ వివరాలిలా ఉన్నాయి.

4 అంగుళాల డబ్ల్యువిజిఎ డిస్‍ప్లే,  480x800 పిక్సెల్ రిజల్యూషన్;   1.5 Ghz క్వాడ్ కోర్ ప్రోసెసర్;  512 MB ర్యామ్; ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం;  4GB ఇంటర్నల్ మెమరీ, మైక్రో ఎస్డీ కార్డుతో 32GB దాకా పెంచుకొనే అవకాశం.  ఎల్‍ఈడీ ఫ్లాష్‌తో  5MP రేర్ కెమెరా,  2MP ఫ్రంట్ కెమెరా,  1,700 mAh బ్యాటరీ..

చౌక ఫోన్‌తో మార్కెట్‍ను ఆక్రమించాలని రిలయన్స్ చేస్తున్న ప్రయత్నం ఎలాంటి ఫలితాలకు దారి తీస్తుందో చూడాల్సిందే...

 

జన రంజకమైన వార్తలు