ఇయర్ ఫోన్స్ అంటే ఇప్పుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లదే రాజ్యం. ఇందులో 500 నుంచి 50, 60 వేల రూపాయల వరకు ఉన్నాయి. అయితే ఇందులో 5వేలలోపు ధరలో కూడా మంచి ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్ల లిస్ట్ మీకోసం..
జబ్రా ఎలైట్ 65టీ (Jabra Elite 65t)
* ఆడియో రంగంలో బాగా పేరున్న జబ్రా నుంచి జబ్రా ఎలైట్ 65టీ మంచి ట్రూ ఇయర్‌లెస్ ఫోన్.
* 4 మైక్రోఫోన్ టెక్నాలజీతో నోయిస్ రిడక్షన్ ఫీచర్ ఉంది.
* అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరిలను సపోర్ట్ చేస్తాయి.
* బ్యాటరీ లైఫ్ 15 గంటలు, బ్యాటరీ ఛార్జింగ్ కేస్ ఉన్నాయి.
* ఐపీ55డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఉంది.
* ధర : 4,999 రూపాయలు.
ఒప్పో ఎన్‌కో ఫ్రీ (Oppo Enco Free)
* ఒప్పో ఎన్‌కో ఫ్రీని యాపిల్ ఎయిర్‌పాడ్స్ మాదిరిగానే ఉంది.
* ఎయిర్‌ప్యాడ్స్ మాదిరిగానే ఇందులో 13.4 మిల్లీమీటర్ల అల్ట్రా డైనమిక్ స్పీకర్ ఉంది.
* ఛార్జింగ్ కేస్‌తోపాటు కలిపి 25 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంది.
* ధర: 4,999 రూపాయలు
రియల్‌మీ బడ్స్ ఎయిర్ (Realme Buds Air)
* ఇది కూడా యాపిల్ ఎయిర్‌పాడ్స్ మాదిరిగానే ఉంది.
* రెండు ఇయర్‌బడ్స్‌లో 12 మిమీ డైనమిక్ బాస్ బూస్ట్ డ్రైవర్స్ ఉన్నాయి. ఇందువల్ల డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది.
* ఛార్జింగ్ కేస్‌తోపాటు కలిపి 17 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంది.
* ధర: 3,999 రూపాయలు
హైఫైమ్యాన్ టీడబ్ల్యూఎస్400 (HIFIMAN TWS400)
* ఇది చాలా తేలికైన ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్. బరువు జస్ట్ 5.9 గ్రాములు ఉంది.
* 10 గ్రాములు ఛార్జ్ చేస్తే 120 నిముషాల ప్లే బ్లాక్ ఇస్తుంది.
* ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే ఛార్జింగ్ కేస్‌తో కలిసి 19 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది.
* ధర 3,499 రూపాయలు.
బోట్ ఎయిర్‌డోప్స్ 441 (boAt Airdopes 441)
* పెద్ద ఆడియో సంస్థ అయిన బోట్ నుంచి తక్కువ ధరలో వచ్చిన ట్రూ ఇయర్‌లెస్ ఎయిర్‌బడ్ ఇది.
* బోట్ ఎయిర్‌డోప్స్ 441 పేరుతో వచ్చిన ఈ ఇయర్‌ఫోన్స్ వాటర్ రెసిస్టెంట్
* రెండు మైక్రోఫోన్లు వాటికి రెండు టచ్ కంట్రోల్స్ ఉన్నాయి.
* ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే ఛార్జింగ్ కేస్‌తో కలిసి 30 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది.
* ధర: 1,999 రూపాయలు