• తాజా వార్తలు

భారీ కెమెరా, బెస్ట్ ఫీచ‌ర్ల‌తో బ‌డ్జెట్ ఫోన్ల రేస్‌లోకి టెక్నో కామన్ 16 స్మార్ట్‌ఫోన్

ఇండియాలో బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ల రేస్ న‌డుస్తోంది. తాజాగా మ‌రో చైనా కంపెనీ టెక్నో కామ‌న్‌.. భారీ బ్యాట‌రి, బ్ర‌హ్మాండ‌మైన ఫీచ‌ర్ల‌తో బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ టెక్నోకామ‌న్ 16ను రిలీజ్ చేసింది.  ఈ ఫోన్ విశేషాలేంటో చూద్దాం.

టెక్నో కామన్ 16 ఫీచర్లు
* 6.80 ఇంచెస్  ఫుల్ హెచ్ డీ హోల్ పంచ్ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్ 
* మీడియాటెక్ హెలియో జి 79 సాక్ ప్రాసెస‌ర్‌
* 4 జీబీ ర్యామ్ 
* 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
కెమెరాలు
వెనుక‌వైపు నాలుగు కెమెరాల సెట‌ప్ ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ కెమెరాతోపాటు స‌పోర్ట్‌గా 2 మెగాపిక్సెల్ కెమెరాలు మూడు ఇచ్చింది.  వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం ముందువైపు16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమ‌ర్చారు.


భారీ బ్యాట‌రీ, ఫాస్ట్ ఛార్జింగ్‌
టెక్నో కామ‌న్ 16లో బ్యాట‌రీ సామ‌ర్థ్యం 5000 ఎంఏహెచ్.  ఒక్క‌సారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 34 గంటల కాలింగ్ టైమ్‌, 16 గంటల వెబ్ బ్రౌజింగ్ , 22 గంటల వీడియో ప్లేబ్యాక్ , 15 గంటల గేమ్ ప్లే, 180 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్  తమ స్మార్ట్ ఫోన్ అందిస్తుంద‌ని టెక్నోచెబుతోంది. రెండు గంటల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని చెప్పింది.  

ధర 
టెక్నో కామన్ 16 ధర 10,999 రూపాయలు. అక్టోబర్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సందర్భంగా టెక్నో కామన్ 16ను కొనుక్కోవ‌చ్చు.  క్లౌడ్ వైట్,  బ్లూ కలర్స్‌లో దొరుకుతుంది.

జన రంజకమైన వార్తలు