సెల్‌ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌గా మారడానికి దశాబ్దాలు పట్టింది. కానీ ఆ తర్వాత ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో, కొత్త టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్‌తో జనాన్ని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అలాంటి స్మార్ట్‌ఫోన్లలో త్వరలో రాబోతున్న కొత్త కొత్త టెక్నాలజీల గురించి రోజూ ఒకటి మీకు పరిచయం చేస్తోంది కంప్యూటర్ విజ్ఞానం. నిన్నటి ఆర్టికల్‌లో కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్ గురించి చూశారు కదా.. ఇప్పడు బటన్లు, పోర్టులు లేని స్మార్ట్‌ఫోన్ల గురించి ఓ తెలుసుకుందాం.
బటన్ లెస్, పోర్ట్‌లెస్ స్మార్ట్‌ఫోన్
స్మార్ట్ ఫోన్ ఎంత స్మార్టయినా ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఇయర్ ఫోన్లకూ పోర్ట్‌లు కావాలి. సౌండ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, పవర్ ఆన్ ఆఫ్‌కీ బటన్స్ కావాలి. ఇకపై ఇవేవీ లేకుండా కూడా ఫోన్లు రాబోతున్నాయి. బటన్లు, పోర్టులు లేని ఫోన్లను గూగుల్ తమ నెక్సస్ ఫోన్లలో తీసుకురాబోతోంది.
గతంలోనూ ట్రై చేశారు
ఈ పోర్ట్‌లెస్, బటన్ లెస్ స్మార్ట్‌ఫోన్ ఐడియా రెండేళ్ల కిందటే వచ్చింది. గతేడాది జనవరిలోనే మెయిజు జీరో పేరిట ఓ ఫోన్ రిలీజ్ అయింది. అందులో బటన్లు, పోర్టులు లేవు. అలాగే వివో అపెక్స్ 2020, ఎంఐ మిక్స్ ఆల్ఫా, సెన్సెల్ బటన్‌లెస్ స్మార్ట్‌ఫోన్ అల్రెడీ దీన్ని ట్రై చేశాయి కూడా.
ఎలా సాధ్యం?
బటన్లు, పోర్ట్‌లు లేకుండా ఫోన్లు ఎలా ఉంటాయనేది మీ ప్రశ్నా. అయితే స్మార్ట్ ఫోన్లు వచ్చిన కొత్తలో ఫోన్లు గుర్తున్నాయా? కెపాసిటివ్ టచ్‌తో వచ్చే ఆ ఫోన్లలో ఎక్కవ బటన్లు, పోర్టులు ఉండేవి కాదు. ఇప్పుడు టెక్నాలజీ మరింత పెరిగింది. సౌండ్, పవర్ బటన్స్ కూడా ఇన్‌డిస్‌ప్లేలోనే పెట్టేయవచ్చు. ఇక వైర్‌లెస్ ఛార్జర్ వచ్చాక ఛార్జింగ్‌కు పోర్ట్‌తో పనేముంది? సో ఎలాంటి బటన్లు, పోర్ట్‌లు లేకుండా స్మార్ట్‌ఫోన్లు వచ్చే రోజు త్వరలోనే ఉంది.