• తాజా వార్తలు

2020లో మ‌నం చూడాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్ ట్రెండ్స్ ఇవే

2020లో అడుగుపెట్టాం.. 2019 వ‌ర‌కు టెలికాం రంగంలో ఎన్నో పెను మార్పులు చూశాం.  ఇక రాబోయేవ‌న్నీ స్మార్ట్ రోజులే.  కొత్త ఏడాదిలో స్మార్ట్‌ఫోన్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ట్రెండ్స్ వేగంగా మారిపోతున్నాయి. మెగాపిక్స‌ల్స్ ద‌గ్గ‌ర నుంచి స్క్రీన్ వ‌ర‌కు ఎన్నో ర‌కాల ఫోన్లు మ‌నం చూడ‌బోతున్నాం. 

కాన్సెప్ట్ ఫోన్లు
త్వ‌ర‌లో కాన్సెప్ట్ ఫోన్లు రాబోతున్నాయి.  అయితే అన్ని స్మార్ట్‌ఫోన్లు ఇదే బాట‌లో న‌డుస్తాయ‌ని చెప్ప‌లేం. నెక్ట్ లెవ‌ల్ ఉండేలా ఈ ఫోన్ల‌ను త‌యారు చేస్తున్నారు. రాబోయే ఇన్నోవేష‌న్ ఫోన్లు ఇవే. వ‌న్‌ప్ల‌స్ కంపెనీ ఈ ఫోన్ల త‌యారీలో ముందు ఉంది. సీఈఎస్ 2020లో ఈ కొత్త కాన్సెప్ట్  ఫోన్ రాబోతోంది. అయితే దీనిలో రాబోయే ఫీచ‌ర్ల గురించి మాత్రం బ‌య‌ట‌కు పొక్క‌ట్లేదు. ఈ ఫీచ‌ర్లు ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  వివో ఎపెక్స్ 2019, షియోమి, ఎం ఎంఎక్స్ అల్ఫా, మీజు జీరో  లాంటి ఫోన్లు కూడా ఇదే కోవ‌కు చెందిన‌వి.

పెద్ద కెమెరాలు, ఎక్కువ కెమెరాలు
డ్యుయెల్ కెమెరాలు వ‌చ్చిన కొత్త‌లో అబ్బో అనుకున్నాం. పెద్ద పిక్స‌ల్ వ‌చ్చిన తొలినాళ్ల‌లో సూప‌ర్ అనేసుకున్నాం.. ఇప్పుడు వాటికి మించిన కెమెరాలు, పిక్స‌ల్స్ రాబోతున్నాయి. 48 ఎంపీ, 64 ఎంపీకి మించిన ఎంపీల‌తో కెమెరా ఫోన్ల‌ను మనం 2020లో చూడ‌బోతున్నాం. ఇవి దాదాపు 108 ఎంపీ కెమెరాలల‌తో వ‌స్తున్నాయి. షియోమిలోని ఎంఐ నోట్ 10 సిరీస్‌లో ఇప్ప‌టికే ఇలాంటి త‌ర‌హా ఫోన్లు ఉన్నాయి. కానీ కొత్త ఏడాదిలో ఈ టైపు ఫోన్లు బాగా విస్త‌రించ‌నున్నాయి. శాంసంగ్‌, రియ‌ల్‌మి లాంటి కంపెనీలు ఈ పెద్ద కెమెరాలు, ఎక్కువ కెమెరాలతో ఫోన్ల‌ను రూపొందిస్తున్నాయి. 

5 జీ డివైజ్‌లు, పెద్ద బ్యాట‌రీలు
3జీ, 4జీ అయిపోయింది. ఇప్పుడు రాబోతోంది 5 జీ. ఫోన్లో నెట్‌ను మ‌రింత పరుగులు పెట్టించ‌డానికి కొత్త డివైజ్‌లు రెడీ అవుతున్నాయి. 5జీ ఫోన్లు రాబోతున్నాయి. 2020 మ‌ధ్య క‌ల్లా భార‌త్‌లోనూ విస్తృతంగా ఈ ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఐ ఫోన్ 11 సిరీస్‌లో ఇప్ప‌టికే ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. అయితే ఇక‌పై మిగిలిన ఫోన్ల‌లోనూ ఈ ఆప్ష‌న్ రానుంది. వ‌న్ ప్ల‌స్‌, రియ‌ల్‌మి, షియోమి, శాంసంగ్ ఫోన్లు ఈ డివైజ్‌ల‌ను త‌యారు చేస్తున్నాయి. 5జీతో పాటు పెద్ద బ్యాట‌రీలు కూడా ఇన్నోవేష‌న్‌లో భాగంగా వ‌స్తున్నాయి. 6000 ఎంఏహెచ్ బ్యాటరీలు రానున్నాయి. మీరు ఎంతసేపు ఫోన్ వాడినా బ్యాట‌రీ కాకుండా ఉండే ఫోన్లు రాబోతున్నాయి.  

జన రంజకమైన వార్తలు