• తాజా వార్తలు

గేమ్స్ కోసం సరికొత్త ల్యాప్ టాప్

ల్యాప్ టాప్ లకు పెట్టింది పేరైన లెనోవా తన సత్తాను చాటుతూ ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచికి తగ్గ మార్పులతో వస్తోంది. ఇప్పటికే  పీసీలు, టాబ్లెట్స్‌, స్మార్ట్‌ఫోన్లతో వంటి వాటి విషయంలో సత్తా చాటిన లెనోవా... తాజాగా గేమ్స్ కోసం ప్రత్యేకంగా ఒక ల్యాప్ టాప్ ని తీసుకొచ్చింది. దీని పేరును ''వై700 గేమింగ్‌'' నామకరణం చేసింది. హై కాన్ఫిగరేషన్‌తో పాటు... రిచ్‌ గ్రాఫిక్స్‌ ఉండడంతో గేమ్స్ ఆడేవారికి సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
 
పూర్తి వివరాలు:- 
 
  • వన్‌ టెరాబైట్‌ ఇన్‌బిల్ట్‌ సామర్థ్యం
  • 128 జీబీ ఎస్‌ఎ్సడీతో ఇంటెల్‌ కోర్‌ ఐ7 స్కైలేక్‌ సీపీయూ 
  • విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  • డిజైన్‌ గ్రాఫిక్స్‌, డిజిటల్‌ ఆడియో జేబీఎల్‌ స్పీకర్స్‌, 
  • మల్టీ టచ్‌ డిస్‌ప్లే 
  • ర్యామ్:-16 GB DDR3L SDRAM
  • సైజ్ :- 15.6 inches
  • ప్రాసెసర్ :- 2.6 GHz Core i7 6700HQ
  • 15 అంగుళాల స్ర్కీన్‌ 
  • ధర రూ.99,900.  
  • eBay.inలో అందుబాటులో ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు