రిలయన్స్ CDMA సర్వీసుల అధినేత అనిల్ అంబానీ ఆధ్వర్యం లోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ దేశ వ్యాప్తంగా తాము CDMA సేవలను ఆపి వేసిన 12 సర్కిల్ లలో 4 జి నెట్ వర్క్ ను ఈ వారమే ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వారి యొక్క ప్రసార పౌనపున్యాన్ని 4 జి LTE నెట్ వర్క్ తో సమీకృతం చేస్తూ సబ్ 1 GHz బ్యాండ్ పై 4 జి ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక్కడవరకూ బాగానే ఉంది కానీ, చాలా మంది వినియోగదారులకు Rcom 4 జి మరియు జియో 4 జి ల మధ్య దేన్నీ ఎంచుకోవాలో తెలియనంత గందరగోళం నెలకొని ఉంది. అందువల్లనే ఈ రెండింటి మధ్య సారూప్యాలను వివరిస్తూ Rcom యొక్క ఆఫర్ లను మీ ముందుకు తీసుకురావాలని మేము భావించాము. Rcom 4 జి :- అనిల్ అంబానీ నేతృత్వం లోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తాము జియో యొక్క సహయం తో పాన్ ఇండియా 4 జి ని లాంచ్ చేయనున్నట్లు గత సంవత్సరమే ప్రకటించింది. సరికొత్త 4 జి ప్లేయర్ అయిన ఈ జియో 4 జి అతని సోదరుడు అయిన ముఖేష్ అంబానీ నేతృత్వం లో ఉన్నది. 4 జి ని లాంచ్ చేసేందుకు గత చివరి స్పెక్ట్రమ్ వేలంలో 850 MHz బ్యాండ్ ఉన్న అదనపు స్పెక్ట్రమ్ ను Rcom కొనుగోలు చేసింది. అయితే గత దశాబ్దం పైగా వారు ఉపయోగిస్తున్న CDMA సర్వీసులకు కూడా ఈ 850 MHz ను సరళీకృతం చేయడానికి RCom TRAI ను ఆశ్రయించింది. అయితే కొంత ఫీజు చెల్లించి తమ ముఖ్యమైన సర్కిల్ లు అయిన కోల్ కత , ముంబై మరియు ఢిల్లీ లలో ప్ర్రారంభించుకోవడానికి TRAI ఆనుమతినిచ్చింది. ఏది ఏమైనప్పటికీ మిగతా సర్కిల్ లలో కూడా అతి కొద్ది సమయం లోనే దీనిని అందుబాటులోనికి తీసుకురావడానికి RCom ప్రయత్నిస్తుంది.అంటే RCOM ప్రస్తుతానికి తన CDMA వినియోగాదారులకే అందుబాటులోనికి రానుంది. LTE బ్యాండ్ :- RCom 4 జి సబ్ స్క్రైబర్ లలో చాలామంది రిలయన్స్ CDMA నెట్ వర్క్ క్లోజ్ అయిన వెంటనే జియో యొక్క 1800మరియు 2300MHz LTE నెట్ వర్క్ బ్యాండ్ పై 4 జి యాక్సెస్ ను పొందుతారు. ప్రాథమికంగా మాత్రమే ఈ మార్పు ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు తమ సొంత బ్యాండ్ అయిన 850 MHz ను సమీకృతం చేసిన తర్వాత బ్యాండ్ 5 పై Rcom తన సొంత 4 జి సేవలను ప్రారంభిస్తుంది. VoLTE లేదా CSFB:- VoLTE అంటే వాయిస్ ఓవర్ LTE. LTE నెట్ వర్క్ అనేది 3 జి మరియు 2 జి లలో వాయిస్ కాల్ లను సపోర్ట్ చేయదు కాబట్టి వాయిస్ కాల్ ల కోసమే డెవలప్ చేయబడిన ఒక సరికొత్త IP ప్లాట్ ఫాం ని VOLTE అని అంటారు. ప్రస్తుతం జియో 4 జి తన వినియోగదారుల వాయిస్ కాల్ ల కోసం ఈ VoLTE ని ఉపయోగిస్తుంది. కానీ మిగతా 4 జి ఆపరేటర్ లు అయిన ఐడియా, ఎయిర్ టెల్, వోడఫోన్ లు మాత్రం తమ వాయిస్ కాల్ ల కోసం సర్క్యూట్ స్విచేడ్ ఫాల్ బ్యాక్ CSFB అనే మరొక ఫ్లాట్ ఫాం ను ఉపయోగిస్తున్నాయి. ఈ రెండింటి నీ పోల్చి చూసినపుడు CSFB నే మెరుగైన వాయిస్ కాల్ లను అందిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మనం ఎవరికైనా కాల్ చేసినా లేదా మనకు ఏదైనా కాల్ వచ్చినా CSFB అనేది ఆటోమాటిక్ గా 2 జి లేదా 3 జి కి పడిపోతుంది, తద్వారా వాయిస్ కాల్ లలో నాణ్యత పెరుగుతుంది. విస్వనీయవర్గాల సమచారం ప్రకారం Rcom కూడా వాయిస్ కాల్ లకోసం ఈ CSFB నే ఉపయోగించనుంది. నెట్ వర్క్ :- ప్రస్తుతానికి RCom అనేది రిలయన్స్ జియో యొక్క అన్ని IP సిస్టం లపై ఆధారపడి పని చేస్తుంది జియో కు ఎటువంటి నెట్ వర్క్ సదుపాయం, డేటా స్పీడ్ లాంటి అంశాలు ఉంటాయో Rcom కు కూడా అవే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే Rcom 4 జి నెట్ వర్క్ ను జియో యొక్క మరొక నెట్ వర్క్ గా భావించవచ్చు. కవరేజ్:- Rcom అనేది 1 GHz స్పెక్ట్రమ్ పై ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి జియో యొక్క ముఖ్యమైన LTE బ్రాండ్ లతో పోలిస్తే Rcom 4 జి మెరుగైన కవరేజ్ ను అందిస్తుంది.జియో యొక్క LTE బ్రాండ్ లకంటే 60 శాతం మెరుగైన కవరేజ్ ని ఈ Rcom అందిస్తున్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. కోల్ కతా సర్కిల్ లో ఉన్న కొన్ని గ్రామాలలో సైతం Rcom 4 జి నెట్ వర్క్ స్థిరం గా ఉన్నట్లు తెలిసింది. VAS అంశాలు:- ఎయిర్ టెల్, వోడా ఫోన్, రిలయన్స్ లాంటి ఆపరేటర్ లు తమ 4 జి సర్వీస్ ల యొక్క వేల్యూ యాడెడ్ సేవల గురించి ఎక్కడా ప్రస్తావిoచవు.కానీ RCOM తన ప్రీ పెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ప్రణాళికలతో VAS అంశాలను ముస్తాబు చేసినట్లు తెలుస్తుంది. తమ సొంత ఎంటర్ టెయిన్ మెంట్ విభాగం అయిన రిలయన్స్ ఎంటర్ టెయిన్ మెంట్ నుండి మూవీ లూ , మ్యూజిక్ లాంటి ఆకర్షణీయమైన VAS అంశాలను RCom తన వినియోగదారులకు అందించనుంది. రోమింగ్. Rcom 4 జి నెట్ వర్క్ కు మారిన CDMA వినియోగదారులు రోమింగ్ ను మొదటగా జియో నెట్ వర్క్ ద్వారా పొందుతారు.మాకు అందుతున్న సమాచారం ప్రకారం 4 జి వినియోగదారులు రోమింగ్ లో దేశం లోని ఏ రాష్ట్రానికైనా చెందినా 3 జి మరియు 2 జి సులువుగా మరే అవకాశం ఉంది. 4 జి నెట్ వర్క్ యొక్క అందుబాటు:- Rcom యొక్క 4 జి నెట్ వర్క్ లు దేశం లోని ఏఏ సర్కిల్ లలో ఎప్పుడు లాంచ్ అయ్యేదీ ఇవ్వడం జరిగింది.
4 జి సిం ల అందుబాటు:- ప్రస్తుతానికి Rcom యొక్క 4 జి సిం లు ఇప్పటికే ఉన్న CDMA వినియోగదారులు మరియు నెట్ కనెక్ట్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోనికి రానున్నాయి. GSM వినియోగదారులకు 4 జి సేవలు అందించే విషయం లో కంపెనీ ఇంతవరకూ ఏ విధమైన ప్రకటనా చేయలేదు. డేటా టారిఫ్ : Rcom తన డేటా టారిఫ్ ల గురించి ఎక్కడా విడుదల చేయనప్పటికీ మాకున్న సమాచారం ప్రకారం Rcom యొక్క డేటా టారిఫ్ ఎలా ఉంటుందో అంచనా వేసి అందించగలుగుతున్నాం. Rcom యొక్క డేటా టారిఫ్ 1 జిబి కి రూ 300 గానూ అదే 10 జిబి ప్యాక్ లైతే రూ 1750 గానూ ఉండవచ్చు.అయితే CDMA అన్ లిమిటెడ్ డేటా కస్టమర్ లు అన్ లిమిటెడ్ డేటా ను పొందుతారా లేదా అనేది ఇంకా అస్పష్టం గానే ఉన్నది. జియో యొక్కా డేటా రేట్ లతో పోలిస్తే Rcom యొక్క డేటా రేట్ లు ఎంతో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక్కసారి జియో కనుక లాంచ్ అయిందంటే డేటా రేట్ లు అమాంతం పడిపోయే అవకాశం ఉంది.` ఇదీ RCOM 4 జి యొక్క సమగ్ర విశ్లేషణ |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||