కరోనా నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుపతున్న ఇండియన్ రైల్వే నెమ్మదిగా నిబంధనలు సడలిస్తోంది. ఇకపై రైలు స్టార్టింగ్ పాయింట్‌లో బయలుదేరడానికి 5 నిమిషాల ముందు వరకు కూడా టికెట్ రిజర్వ్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఈ సౌకర్యం అక్టోబర్ 10 (ఈ రోజు) నుంచే అమలవుతుంది. దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే..
* రైలు స్టార్టింగ్ పాయింట్లో బయల్దేరడానికి 4గంటల ముందు ఫస్ట్ రిజర్వేషన్ చార్టు తయారు చేస్తారు.
* సెకండ్ రిజర్వేషన్ చార్టు ట్రైన్ స్టార్టవడానికి అరగంట నుంచి 5 నిమిషాల ముందు రెడీ అవుతుంది.
* ఫస్ట్ రిజర్వేషన్ ఛార్ట్ తర్వాత క్యాన్సిలేషన్లు, ఖా|ళీలను బట్టి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు
* ఇలా 5 నిమిషాల ముందు టికెట్లు బుక్ చేసుకోవడానికి పాసింజర్ రిజర్వేషన్ కౌంటర్లు (పీఆర్‌ఎస్) ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
* ఆన్‌లైన్ ద్వారా (ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వరా) కూడా రిజర్వేషన్ టికెట్లిస్తారు.
* ఈ నెల 17 నుంచి నడవనున్న తేజ్‌సతో సహా అన్ని ప్రత్యేక రైళ్లకు ఇది వర్తిస్తుంది.
*ట్రైన్ స్టార్టింగ్ పాయింట్లో బయల్దేరడానికి 5 నిమిషాల ముందు వరకు టికెట్స్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. అయితే క్యాన్సిలేషన్ |ఛార్జీలు తీసుకుంటారు.