ఖరీదైన ఫోన్ కొనుక్కోవాలని మనసు లాగుతున్నా అమ్మో చేయి జారితే ఇంకేమన్నా ఉందా? పిల్లలు ఏ నీళ్లో పడేస్తే ఫోన్ పాడైపోద్దేమో అనే సందేహంతో కాస్ట్‌లీ ఫోన్లు కొనడానికి వెనకాడుతున్నారా? ఇప్పుడు ఆ బెంగ లేదు. ఎంఐ, శాంసంగ్ , వన్‌ప్లస్ వంటి కంపెనీలు తమ ఫోన్ కొన్నవారికి నామమాత్రపు రుసుముకే ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాయి. ప్రమాదవశాత్తూ ఫోన్ కింద పడి పగిలినా, లిక్విడ్ వల్ల డ్యామేజ్ అయినా ఫ్రీగా సర్వీస్ చేసి ఇస్తారు. ఇప్పుడు అలాంటి ప్లాన్‌నే హువావే కూడా తన ఫోన్లకు తీసుకొచ్చింది. అదేంటో చూడండి.
రేట్ మారుతుంది
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు హువావే ఇటీవల ఇండియన్ మార్కెట్‌లో దూకుడు పెంచింది. హువావే పీ20ప్రో పేరిట ఓ ఫ్లాగ్‌షిప్ ఫోన్,ను తెచ్చింది. 6జీబీ ర్యామ్, రియర్ సైడ్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్న ఈ ఫోన్ ధర 64వేలు. హువావే పీ 20 లైట్ 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. దీని ధర రూ.19,999. ఇవేకాక తన సబ్‌బ్రాండ్ హానర్ నుంచి కూడా హానర్ 7ఎక్స్, హానర్ వీ 10, హానర్ 8 ప్రో వంటి మోడల్స్‌తో మార్కెట్లో సందడి చేస్తోంది. ఇప్పుడు కంపెనీ తన మొబైల్స్‌కు వన్ అసిస్టెంట్ అనే కంపెనీతో కలిసి ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా అందుబాటులోకి తెచ్చింది. పీ 20 ప్రోకి సంవత్సరానికి ఇన్సూరెన్స్ 5,949 రూపాయలు.మిగిలినవాటికి 1,249 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.
ఎలా వాడుకోవాలి?
* ఫోన్ కొన్న 15 రోజుల తర్వాత నుంచి ఏడాదిపాటు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
*పొరపాటున కిందపడినా, ప్రమాదవశాత్తూ దెబ్బతిన్నా, లిక్విడ్స్ వల్ల దెబ్బతిన్నాఫోన్‌ను ఫ్రీగా బాగు చేసి ఇస్తారు.
* పికప్, సర్వీస్ పూర్తయ్యాక డోర్ డెలివరీ కూడా ఫ్రీ.
* 24 గంటలూ పనిచేసే అసిస్టెన్స్