• తాజా వార్తలు

జియో ఫోన్ తోపాటు టీవీ కేబుల్ వెనుక మ‌ర్మం ఇదేనా?  

జియో ఫీచ‌ర్ ఫోన్‌తోపాటు దాన్ని టీవీకి కూడా క‌నెక్ట్ చేసుకోగ‌లిగే ఫీచ‌ర్ కూడా ఉంటుంద‌ని రిల‌య‌న్స్  ప్ర‌క‌టించింది. జియో ఫోన్ టీవీ కేబుల్ తో   జియో ఫీచ‌ర్ ఫోన్‌ను టీవీకి ఎటాచ్ చేసి మొబైల్‌లో వ‌చ్చే కంటెంట్‌ను టీవీలో చూసుకోవ‌చ్చు.  లేటెస్ట్ టీవీల‌తోపాటు పాత సీఆర్‌టీ టీవీల‌కు కూడా ఈ కేబుల్ పని చేస్తుంద‌ని అంబానీ అనౌన్స్ చేశారు.   309 రూపాయ‌లతో జియో ఫోన్‌ను మంత్లీ రీ ఛార్జి  చేసుకుంటే దాన్ని టీవీకి క‌నెక్ట్ చేసి మూడు నాలుగు గంట‌ల‌పాటు వీడియోస్ చూడ‌వ‌చ్చ‌ని కూడా చెప్పారు.  అంతేకాదు రెండు రోజుల‌కు 24 రూపాయ‌ల‌తో, వారం రోజుల‌కైతే 54 రూపాయ‌ల‌తోనూ చిన్న డేటా ప్యాక్స్ కూడా అనౌన్స్ చేశారు.   అయితే జియో ఫోన్ ను టీవీకి క‌నెక్ట్ చేసుకోవ‌డానికి ఇచ్చే ఈ కేబుల్  Lyf ఫోన్ల‌కు కూడా ఇస్తారా లేదా ఇంకా క్లారిటీ లేదు.  కేబుల్ డివైస్ కూడా ఫోన్‌తో పాటే ఇస్తారా లేదా దాన్ని వేరుగా కొనుక్కోవాలా కూడా జియో క్లారిటీ ఇవ్వ‌లేదు. 

బిజినెస్ ప్లాన్ ఇదేనా?
 దేశంలో చాలా ప్రాంతాల్లో కేబుల్ స‌ర్వీస్‌ల‌కు  నెల‌కు 300 నుంచి  500 వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతోంది.  ఆ స‌ర్వీసుల‌ను ఫీచ‌ర్ ఫోన్ల‌తోపాటు అందివ్వ‌గ‌లిగితే యూజ‌ర్ నుంచి ఎక్కువ రెవెన్యూ ( higher average revenue per user -ARPU) రాబ‌ట్ట‌వ‌చ్చ‌న్న‌ది రిల‌య‌న్స్ ఆలోచ‌న అని బిజినెస్ అన‌లిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు. దీనిలో భాంగానే జియో ఫీచ‌ర్ ఫోన్‌ను టీవీకి క‌నెక్ట్ చేసి చూడాలంటే 153 (డేటాప్లాన్) కు 300 రూపాయ‌ల కేబుల్ స‌ర్వీస్ ప్లాన్ కూడా క‌లిపి వ‌సూలు చేయాల‌న్న‌ది జియో ప్లాన్ కావ‌చ్చ‌ని ఎన‌లైజ్ చేస్తున్నారు.  ఫీచ‌ర్ ఫోన్లు వాడుతున్న‌వారు నెల‌కు 150 నుంచి 200 రూపాయ‌ల‌కు మించి ఖ‌ర్చు పెట్ట‌రు. కాబ‌ట్టి వారి నుంచి ఎక్కువ రెవెన్యూ రాబ‌ట్టాలంటే కాల్స్ ఫ్రీగా ఇచ్చినా డేటా ప్లాన్, కేబుల్ స‌ర్వీస్ ప్లాన్‌తో వ‌ర్క‌వుట్ చేసుకోవ‌డానికి జియో సిద్ధ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.  యూజ‌ర్ దీన్ని భారంగా భావించ‌కుండా ఉండాలి. అదే టైంలో దేశంలో ఉన్న 50 కోట్ల మంది ఫీచ‌ర్ ఫోన్ యూజ‌ర్ల‌లో ఎక్క‌వు మందిని త‌న‌వైపు ఆక‌ర్షించ‌డానికే కేబుల్‌తో మొబైల్ డేటా కంటెంట్‌ను టీవీలో చూసే ఫెసిలిటీ తీసుకొస్తోంది.  
 మొబైల్ క్వాలిటీ కీల‌కం
 ఈ స్థాయిలో కంటెంట్‌ను టీవీలో చూడాలంటే మొబైల్ చాలా క్వాలిటీగా ఉండాలి. ముఖ్యంగా బ్యాట‌రీ లైఫ్‌, హై స్పీడ్ డేటాను క్యారీ చేయ‌గ‌లిగేలా ఉండాలి. ఈ విష‌యాల్లో జియో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ఈ జియో ఫోన్ కేబుల్ ఫీచ‌ర్ క్లిక్ అవ‌డం క‌ష్టం.  అదీకాక  కేబుల్ /  డీటీహెచ్ సెక్టార్లోకి అడుగుపెట్టాల‌ని చూస్తున్న రిల‌య‌న్స్ ఇందుకు త‌గ్గ‌ట్లుగానే త‌న జియో స్టోర్‌లో యాప్‌ల‌ను కూడా రూపొందించింది.  సో ఇప్పుడు జియో టీవీ కేబుల్ తో ఈ యాప్స్‌లోని కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా క‌నిపిస్తోంది.  

జన రంజకమైన వార్తలు