జియో ఫోన్ ఇప్పుడు 699 రూపాయలకు దొరుకుతోంది. 2019 దీపావళి ఆఫర్‌గా పెట్టిన ధరే ఇప్పటికీ నడుస్తోంది. అయితే త్వరలోనే ఈ ధరను పెంచే అవకాశాలున్నాయని మార్కెట్ టాక్. కాబట్టి ఇంట్లో పెద్దవారికి ఎవరికైనా కొనాలనుకుంటే వెంటనే కొనుక్కుంటే మంచిది.
300 పెరగొచ్చు
జియో ఫోన్ ధర ఇప్పుడు 699 రూపాయలు. దీని ధరను 300 వరకు పెంచవచ్చని తెలుస్తోంది. అంటే 999 కావచ్చు. దీనికితోడు 125 రూపాయల టాప్ అప్ చేయించాలి. అంటే ధర 1,124 అవుతుంది. అయితే జియో దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
పరిమిత కాల ఆఫర్ అని చెప్పినా
2019లో జియో దీపావళి ఆఫర్‌గా 699 రూపాయలకు జియో ఫోన్ తీసుకొచ్చిన కంపెనీ దీన్ని పరిమిత కాలపు ఆఫర్ అనే చెప్పింది. అయితే ఏడాది పైగా ఆఫర్‌ను కొనసాగించింది. ఇక ధర పెంచడమే తరువాయి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.