చైనా ఉత్పత్తులు కొనకూడదన్న వినియోగదారుల సెంటిమెంట్ మార్కెట్లో మేడిన్ ఇండియా ఫోన్లకు మళ్లీ ప్రాణం పోస్తోంది. మొదట్లో బాగానే రాణించిన మైక్రోమ్యాక్స్, లావా లాంటి ఫోన్లు చైనా ఫోన్ల రాకతో రేస్‌లో వెనకబడిపోయాయి. తాజాగా యాంటీ చైనా సెంటిమెంట్‌తో మైక్రోమ్యాక్స్ కొత్త మోడల్ ఫోన్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు లావా వంతు వచ్చింది. అలా ఇలా కాదు ఒకేసారి నాలుగు ఫోన్లు లాంచ్ చేసేసింది. అవన్నీ 5,500 నుంచి 10 వేల లోపు ధరలో లభిస్తున్నాయి.
లావా జెడ్1
* 5 ఇంచెస్ డిస్‌ప్లే. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* మీడియాటెక్ హీలియో ఏ20 ప్రాసెసర్
* 2జీబీ ర్యామ్
* 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
కెమెరాలు: 5 మెగాపిక్సెల్ రియర్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 3,100ఎంఏహెచ్ బ్యాటరీ
* ధర: రూ.5,499
* జనవరి 26 నుంచి అమెజాన్‌తోపాటు ఆఫ్లైన్ స్టోర్లలోనూ కొనుక్కోవచ్చు.
లావా జెడ్2
* 6.5 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్
* 2జీబీ ర్యామ్
* 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
కెమెరాలు: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమరాలు, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* ధర: రూ.6,999
* జనవరి 11 నుంచి అమెజాన్‌తోపాటు ఆఫ్లైన్ స్టోర్లలోనూ కొనుక్కోవచ్చు.
లావా జెడ్4
* 6.5 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్
* 4జీబీ ర్యామ్
* 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
కెమెరాలు: 13 మెగాపిక్సెల్ + 5 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమరాలు, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* ధర: రూ.8,999
* జనవరి 11 నుంచి అమెజాన్‌తోపాటు ఆఫ్లైన్ స్టోర్లలోనూ కొనుక్కోవచ్చు.
లావా జెడ్6
* 6.5 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్
* 6 జీబీ ర్యామ్
* 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
కెమెరాలు: 13 మెగాపిక్సెల్ + 5 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమరాలు, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* ధర: రూ.9,999
* జనవరి 11 నుంచి అమెజాన్‌తోపాటు ఆఫ్లైన్ స్టోర్లలోనూ కొనుక్కోవచ్చు.