• తాజా వార్తలు

చిన్న మొమరీ కార్డు 360 టెరాబైట్ల డాటాను స్టోర్ చేస్తుంది...

 

1400 కోట్ల సంవత్సరాలైనా చెక్కుచెదరని డాటా

 

చాలా చిన్న మొమరీ కార్డు.. 360 టెరాబైట్ల డాటాను స్టోర్ చేస్తుంది.. అంతేకాదు.... వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిలోనూ మీ డాటాకు నో ప్రాబ్లెం... వంద కాదు, వెయ్యి కాదు, లక్ష.. కోటి అసలే కాదు, ఏకంగా 1400 కోట్ల సంవత్సరాల వరకు ఆ డాటాకు ఎలాంటి ముప్పు ఉండనే ఉండదు. అలాంటా అదిరిపోయే డాటా స్టోరేజి మెమరీ కార్డ్ ను బ్రిటన్ లోని సౌథాంప్టన్ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయపరుస్తోంది.

మొన్నటివరకు 300 మిలియన్ల ఏళ్లపాటు దాచుకునే సామర్ధ్యమున్న మెమరీకార్డును రూపొందించిన నిపుణులు ఇప్పుడు 1400 కోట్ల  సంవత్సరాలు పదిలం చేసుకునే సామర్థ్యమున్న మెమరీ కార్డును అభివృద్ధిచేశారు. అంటే మనం చనిపోయిన తర్వాత కూడా కొన్ని వందల ఏళ్లు మనకు సంబంధించిన విషయాలను ఈ బుల్లి మెమరీకార్డు పదిలంగా ఉంచుతుందన్నమాట. 360 టెరాబైట్స్ డాటాను సిల్వర్ పూత పూసిన నానో స్ట్రక్చర్ క్వార్ట్‌జ్‌ ఫలకాల్లో దాగి ఉండేలా ఈ మెమరీకార్డును డిజైన్ చేశారు.

అంతేకాదు.. ఎలాంటి వైరస్ బారిన పడకుండా కూడా సురక్షిత పద్ధతిలో ఉండేలా టెక్నాలజీని రూపొందించారు. అల్ర్టా ఫాస్ట్ లేజర్ రైటింగ్ విధానంలో డాటాను ఈ మెమరీ కార్డులోకి ఎక్కిస్తారు. సాధారణ టెక్నాలజీ వినియోగారులకు ఇంతటి భారీ డాటా సామర్థ్యం అవసరం లేకపోయినా నేషనల్ ఆర్కైవ్క్స, మ్యూజియంలు, లైబ్రరీల నిర్వహణలో ఇలాంటివి ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఇంతవరకు రూపొందించిన ఏ మమొరీ డివైస్ కూడా ఇంతటి సుదీర్ఘ కాలం డాటాను దాచగలిగే సామర్థ్యం కానీ, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం కానీ కలిగి లేదు. డాటా టెక్నాలజీ చరిత్రలోనే దీన్నో అద్భుతంగా మేధావులు, నిపుణులు కీర్తిస్తున్నారు. ఈ టెక్నాలజీపై అంతా ఆసక్తి చూపుతూ ఇది మరిన్ని ఆవిష్కరణలకు నాంది పలకాలని ఆశిస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాల దృష్టిని దీనిపై పడింది. 

 

జన రంజకమైన వార్తలు