సెల్ ఫోన్ తయారీలో ఒకప్పుడు రారాజులా వెలిగిన నోకియా ఇప్పుడు టీవీల మార్కెట్ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సంస్థ ఇండియా మార్కెట్లో 55, 43 ఇంచుల రెండు టీవీలు తీసుకొచ్చింది. లేటెస్ట్ గా మార్కెట్లోకి 65 ఇంచుల 4కే రిజల్యూషన్ కలిగిన స్మార్ట్ టీవీని లాంఛ్ చేసింది. దీని ధర 60 వేలు. ఫీచర్లు ఇది అండ్రాయిడ్ టీవీ. 4కే డిస్ప్లే ఉంది. క్వాలిటీ మ్యూజిక్ కోసం డాల్బీ విజన్ టెక్నాలజీ కలిగిన జేబీఎల్ స్పీకర్లు అమర్చారు. హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉంది. 480 నిట్స్ బ్రైట్నెస్ తో అత్యంత స్పష్టమైన చిత్రాన్ని చూడొచ్చు. కనెక్టివిటీ కోసం 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు ఇచ్చారు. వై–ఫై, క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. 2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీ, బ్లూ టూత్ వంటివి ఈ టీవీలోని అదనపు ఫీచర్లు. ధర 64,999 రూపాయలు. ఈ నెల 6 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేయొచ్చు.