చైనా బ్రాండే అయినా వన్‌ప్లస్‌కు ప్రీమియం ఫోన్ల మార్కెట్‌లో మంచి వాటానే ఉంది. ప్రీమియం ఫోన్లతో ఇండియన్ మార్కెట్‌లో పాపులర్ అయిన వన్‌ప్లస్ గతంలో రెండు స్మార్ట్‌టీవీలను తీసుకొచ్చింది. ఇప్పుడు బడ్జెట్ రేంజ్‌లో కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టబోతోంది. జూలై 2న కొత్త టీవీలను తీసుకొస్తున్నామని వన్‌ప్లస్ సీఈవో పీట్ లా సోమవారం ట్వీట్ చేశారు.
బడ్జెట్‌లోనే..
ఇప్పటికే వన్‌ప్లస్ రెండు స్మార్ట్‌టీవీలను ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసినా అవి రెండు దాదాపు 70 వేల రూపాయల ధరలో ఉన్నాయి. అయితే ఇటీవల షియోమి, రియల్‌మీ బడ్జెట్ ధరలోనే స్మార్ట్‌టీవీలను రిలీజ్ చేశాయి. దీంతో బడ్జెట్ సెగ్మెంట్‌లోనూ టీవీలను రిలీజ్ చేయాలని వన్‌ప్లస్ నిర్ణయించింది. జులై 2న రిలీజ్ చేయబోయే వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలు బడ్జెట్ రేంజ్‌లోనే ఉంటాయని మార్కెట్ వర్గాల అంచనా.
20వేల లోపే..
వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ టీవీలను 1X,999 ధరలో రిలీజ్ చేయబోతోంది. ధర ఎంతుంటుందో మీరే గెస్ చేయండి అంటూ ఇటీవల ఆసంస్థ ఓ ట్వీట్ చేసింది. అంటే 20 వేల లోపే ధర ఉంటుందని గ్యారంటీ ఇచ్చారు. బెస్ట్-ఇన్-క్లాస్ డిస్‌ప్లే ప్యానెల్స్‌తో, వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో మిడ్ రేంజ్, ఎంట్రీ లెవల్ విభాగాల్లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే టీవీలను వన్‌ప్లస్ మార్కెట్లోకి దింపబోతుందని అంచనా. రియల్‌మీ 12,999కే 32 ఇంచెస్ స్మార్ట్‌టీవీని తీసుకొచ్చిన నేపథ్యంలో వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌టీవీలను రూ.15వేల స్టార్టింగ్ ప్రైస్‌తో అందించబోతుందని మార్కెట్ అంచనా వేస్తోంది. అదే జరిగితే వియూ, షియోమి, రియల్‌మీ ఫోన్లకు పోటీగా బడ్జెట్ ధరలో వన్‌ప్లస్ టీవీలు ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లే.