• తాజా వార్తలు

భారీ బ్యాట‌రీ, సూప‌ర్ ఫీచ‌ర్ల‌తో పోకో ఎం3 లాంచింగ్

 చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ను ప్ర‌పంచ  మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇప్పటికే  పోకో ఎం2 బాగా క్లిక్ అయింది. దీంతో  ఎం3పైనా మంచి అంచనాలున్నాయి.  ఈ ఫోన్ ఫీచ‌ర్లేమిటో చూద్దాం
 
పోకో ఎం3 ఫీచర్స్    
*  6.53 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే. డిస్‌ప్లేకి కూడా  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటె|క్ష‌న్ ఇచ్చింది. 
*  ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ 
* 4జీబీ ర్యామ్  
*  64 / 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ . మైక్రో ఎస్ డీ కార్డ్  ద్వారా 512జీబీ వరకు ఎక్స్‌పాండ‌బుల్ 
*  ఆండ్రాయిడ్ 10సపోర్ట్ తో ఎంఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై ప‌నిచేస్తుంది.  
* సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చింది. అంటే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్ వెనుక కాకుండా సైడ్‌లో ఉంటుంది. 

కెమెరాలు
పోకో ఎం3లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.  48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు  2 ఎంపీ  సెకండరీ సెన్సార్,  2 ఎంపీ  డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమ‌రా

బ్యాట‌రీ
ఇక పోకో ఎం3లో  6,000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ ఉంది. 18  వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్  ఇచ్చింది.  

ధర
పోకో ఎం3 4జీబీ+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర సుమారు రూ. 11,000 
4జీబీ + 128జీబీ స్టోరేజ్ ధర 12,500 వ‌ర‌కు ఉండొచ్చు.   
పోకో ఎం3 ఇండియాకు ఎప్పుడొస్తుందో ఇంకా తెలియ‌దు. అయితే వ‌చ్చే నెల‌లోనే రిలీజ్ ఉండొచ్చు.

జన రంజకమైన వార్తలు