• తాజా వార్తలు

పోకో స్మార్ట్‌ఫోన్ల‌పై డిస్కౌంట్ ధ‌ర‌లు.. ఏ మోడ‌ల్‌పై ఎంత త‌గ్గిందో తెలుసా?

షియోమి త‌న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్ పోకో ఫోన్ల‌పై ధ‌ర‌లు త‌గ్గించింది. పోకో సీ3, పోకో ఎం2, పోకో ఎం2 ప్రో, పోకో ఎక్స్‌3ల‌పై డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్ లైన్ స్టోర్ల‌లోనూ  ఈ తగ్గింపు ధరలు వ‌ర్తిస్తాయి.  ఈ నాలుగు ఫోన్ల స్పెసిఫికేష‌న్లు, ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం.  

పోకో సీ3 
* 6.53 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే  
* మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్  
* రియర్ కెమెరా 13+2+2 మెగాపిక్సెల్,  ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్.
* పోకో సీ3  4జీబీ ర్యామ్, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.500 ధర తగ్గింది. 
* గతంలో ధర రూ.8,999  
* ప్రస్తుత ధర రూ.8,499.  
 

పోకో ఎం2 
 *  6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే 
* మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్  
* రియర్ కెమెరా 13+8+5+2 మెగాపిక్సెల్.  ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్  
* బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్  
*  6జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.1,000 తగ్గించింది. గతంలో ధర రూ.10,999 కాగా ప్రస్తుత ధర రూ.9,999.  
* 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.1,500 తగ్గింది. గతంలో ధర రూ.12,499. ప్రస్తుత ధర రూ.10,999.


పోకో ఎం2 ప్రో  
* 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్  డిస్‌ప్లే 
* రియర్ కెమెరా 48+8+5+2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ 
* బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్  
* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్  
* 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.1,000 తగ్గించింది. గతంలో ధర రూ.13,999 కాగా ప్రస్తుత ధర రూ.12,999.  
* 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌‌పై రూ.1,000 తగ్గింది. గతంలో ధర రూ.14,999 కాగా ప్రస్తుత ధర రూ.13,999.  
* 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడల్‌పై రూ.1,000 ధర తగ్గింది. గతంలో ధర రూ.16,999 కాగా ప్రస్తుత ధర రూ.15,999.

పోకో ఎక్స్3  
* 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల పుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే  
*  స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్  
* రియర్ కెమెరా  64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 682 సెన్సార్, 13 ఎంపీ అల్ట్రావైడ్ సెన్స‌ర్‌,  2  మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 ఎంపీ  డెప్త్ సెన్స‌ర్‌ల‌తో దీనిలో వెనుక‌వైపు మొత్తం 4 కెమెరాలున్నాయి.
* సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 
* బ్యాటరీ 6000ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 
* 6 జీబీ ర్యామ్‌,  128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.500 ధర తగ్గింది. గతంలో ధర రూ.18,499 కాగా ప్రస్తుత ధర రూ.17,999.

జన రంజకమైన వార్తలు