• తాజా వార్తలు

రైల్వే రిజర్వేషన్లకు మార్గదర్శి టికెట్ జుగాడ్...

రైలు టిక్కెట్ల బుక్ చేసుకోవడం ప్రహసనంగా మారిపోయింది. అవసరానికి టికెట్ బుక్ చేసుకుంటే ఆ రోజుకు కన్ఫర్మ్ గా దొరుకుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ కన్ఫర్మ్ టిక్కెట్ దొరక్కుంటే వెయిటింగ్ లిస్టు టిక్కెట్ తీసుకోవాలంటే అది కన్ఫర్మ్ అవుతుందో లేదో ఎవరూ సరిగా చెప్పలేని పరిస్థితి. ఏ స్టేషన్ కు ఎంత కోటా... ఇంకా ఎన్ని టిక్కెట్లు బుక్ చేయొచ్చు.... వెయిటింగ్ లిస్టు ఎంతవరకు టిక్కెట్ ఎంతవరకు ఉంటే టిక్కెట్ తీసుకోవచ్చు వంటివన్నీ అనుమానాస్పద అంశాలే. ఇలాంటి  కష్టాలకు చెక్ చెప్పేందుకు ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు కొత్త యాప్‌ను సిద్ధంచేశారు. 'టికెట్‌ జుగాడ్' అనే  ఈ యాప్‌ ప్రత్యేకమైన అల్గారిథమ్‌ సాయంతో పనిచేస్తుంది.

టికెట్ బుకింగ్‌లో స్టేషన్ల వారీగా కోటాలుంటాయి. ఉదాహరణకు కోల్ కతా స్టేషన్‌ నుంచి మీరు టికెట్టు బుక్‌ చేయాలనుకుంటే.. మీకు వెయిటింగ్ లిస్టు ఉండొచ్చు... కానీ, దానికంటే ముందున్న భువనేశ్వర్ నుంచి ప్రయత్నిస్తే బెర్తు దొరికే అవకాశముండొచ్చు. ఎక్కడి నుంచి బుక్‌చేస్తే టికెట్టు దొరకొచ్చో స్టేషన్లవారీగా వెతుక్కోవాలంటే చాలా కష్టం... అలాంటి కష్టాలు లేకుండా ఈజీగా గైడ్ చేసే ఈ యాప్ ఇప్పుడు ఉపయోగపడబోతోంది.  ఖరగ్‌పూర్‌ ఐఐటీ విద్యార్థి రుణాల్‌ రిజు... ఆయన బంధువు జంషెడ్‌పూర్‌ ఎన్‌ఐటీ విద్యార్థి శుభం బాల్దావాలు కలిసి దీన్ని డెవలప్ చేశారు. ఇటీవల జరిగిన ఐఐటీ గ్లోబల్‌ బిజినెస్‌ మోడల్‌ కాంపిటేషన్‌ లో ఈ యాప్‌కు మొదటి బహుమతిగా రూ.1.5 లక్షలు దక్కాయి. ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం ఆవిష్కరించిన దీన్ని నెల రోజుల్లోనే 5,000 మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

అయితే... ఈ యాప్ పూర్తిగా కొత్తదని చెప్పలేం. ఇప్పటికే బాగా పాపులర్ అయిన కన్ఫర్మ్ టిక్కెట్ అనే యాప్ కూడా ఇలాంటి సర్వీసే అందిస్తుంది. పైగా అందులో వెయిటింగ్ లిస్టు చూపించినా అది కన్ఫర్మ్ కావడానికి ఎంత శాతం అవకాశాలున్నాయో కూడా  చెబుతుంది. అదేసమయంలో ఏఏ స్టేషన్ నుంచి బెర్తు దొరికే అవకాశముంది... మనం వెతుకుతున్న రైలు కాకుండా ఇతర ఏ రైలులో సీట్లున్నాయి వంటి చెబుతుంది. అంటే ప్రత్యామ్నాయ అవకాశాలను మనకు చూపిస్తుందన్నమాట. ఈ యాప్ ఇప్పటికే బాగా పాపులర్. టికెట్ జుగాడ్ కూడా దాదాపుగా అలాగే పనిచేస్తుంది.

 

జన రంజకమైన వార్తలు