చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ స్మార్ట్ వాచ్ అమ్మకాలు ప్రారంభించింది. లేటెస్ట్ ఫీచర్లు, మంచి డిస్ ప్లే తో ఉన్న ఈ వాచ్ 3,999 రూపాయలకే అందుబాటులోకి తెచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్ మీ.కామ్, ఫ్లిప్ కార్ట్ లలో అమ్మకాలు ప్రారంభించింది. ఫీచర్లు. * 1.7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే. * 12 రకాల స్పోర్ట్స్ మోడ్స్ * క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, హాకీ, కబడ్డీ లాంటి 12 రకాల స్పోర్ట్స్ ఆడేటప్పుడు మీ యాక్టివిటీ ఎలా ఉంటుందో ట్రాక్ చేయడానికి సెపరేట్ స్పోర్ట్స్ మోడ్స్ ఉపయోగపడతాయి. * మీ హృదయ స్పందన ఎప్పటికప్పుడు లెక్క కొట్టే రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్ ఈ వాచ్ లో ఉంది. * మీ ఆరోగ్య పరిస్థితిని గమనించడానికి ఎస్ పీవో2 మానిటర్ ఉంది. * మీరు వాచ్ దగ్గరకు వెళ్ళగానే ఆటోమేటిక్ గా అన్ లాక్ అవుతుంది.