• తాజా వార్తలు

శాంసంగ్ బిగ్ టీవీ డేస్‌.. టీవీ కొంటే స్మార్ట్ ఫోన్ ఫ్రీ.. ఏంటీ ఆఫ‌ర్?

టెక్నాలజీ దిగ్గ‌జం శాంసంగ్ స్మార్ట్‌టీవీల అమ్మ‌కాల మీద సీరియ‌స్‌గా దృష్టి పెట్టింది. స్మార్ట్ టీవీల మార్కెట్లోకి వ‌న్‌ప్ల‌స్‌, రియ‌ల్‌మీ లాంటి చైనా కంపెనీల‌న్నీ వ‌చ్చి త‌క్కువ ధ‌ర‌కే సూప‌ర్ ఫీచ‌ర్ల‌తో ఉన్న టీవీలు అందిస్తున్నాయి. ఈ పోటీని త‌ట్టుకోవ‌డానికి శాంసంగ్ కొత్త రూట్ ఎంచుకుంది. టీవీల ధ‌ర‌లు పెద్ద‌గా తగ్గించ‌కుండా టీవీ కొన్న‌వారికి స్మార్ట్‌ఫోన్లు, సౌండ్‌బార్స్ ఫ్రీగా ఇస్తోంది. ఇందుకోసం శాంసంగ్ టీవీ డేస్‌ను ప్ర‌క‌టించింది. ఏమిటీ శాంసంగ్ టీవీ డేస్ ఆఫ‌ర్లు? * శాంసంగ్ టీవీ డేస్ ఆఫ‌ర్‌లో భాగంగా శాంసంగ్ 55 ఇంచెస్‌, 65 ఇంచెస్‌, 75ఇంచెస్‌, 82 ఇంచెస్ స్మార్ట్ టీవీలు, 85 ఇంచెస్ క్యూలెడ్ టీవీలు, క్రిస్టల్ 4కే యూహెచ్‌డీ, క్యూలెడ్ 8కే టీవీలపై బిగ్ టీవీ డేస్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. * శాంసంగ్ 65 అంగుళాల క్యూలెడ్ టీవీ, 75 అంగుళాల క్రిస్టల్ 4కే అల్ట్రాహెచ్‌డీ టీవీ కొంటే రూ.22,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్ ఉచితం. | * శాంసంగ్ 55 ఇంచెస్ క్యూలెడ్ టీవీలు, 65 ఇంచెస్ క్రిస్టల్ 4కే అల్ట్రాహెచ్‌డీ టీవీలు కొంటే రూ.18,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్‌ఫోన్ మీకు ఫ్రీ. * శాంసంగ్ 75 ఇంచెస్‌, 82 ఇంచెఓస్‌, 85 ఇంచెస్ క్యూలెడ్ టీవీలు కొన్నవారికి రూ.48,990 విలువైన సౌండ్‌బార్ HW-Q800T లేదా రూ.99,990 విలువైన సౌండ్‌బార్ HW-Q900T ఫ్రీగా ఇస్తుంది. ఇవి కూడా సెల్‌ఫోన్‌, సౌండ్‌బార్స్ ఉచితంగా ఇవ్వ‌డ‌మే కాదు కస్టమర్లు 20 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. * ఎక్స్‌టెండెడ్ వారెంటీ ఆఫర్స్ కూడా ఉన్నాయి. * అంతేకాదు త‌క్కువ‌లో త‌క్కు రూ.1,990 ఈఎంఐకే కూడా టీవీ కొన‌వ‌చ్చ‌ని శాంసంగ్ ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి 31 వ‌ర‌కే ఆఫ‌ర్లు ఈ శాంసంగ్ టీవీ డేస్ ఆఫర్లు జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. అన్ని శాంసంగ్ స్టోర్లు, లీడింగ్ ఎల‌క్ట్రానిక్స్ షాప్స్‌లో దీన్ని పొంద‌వ‌చ్చ‌ని శాంసంగ్ చెప్పింది.

జన రంజకమైన వార్తలు