మనలో చాలా మంది కొన్ని నెలల నుండీ రిలయన్స్ జియో ను ఉపయోగిస్తూ ఉండి ఉంటాము. అయితే రోజురోజుకీ జియో యొక్క డేటా స్పీడ్ తగ్గడం మనకు అనుభవమే. వినియోగదారులు పెరిగేకొద్దీ డేటా స్పీడ్ తగ్గుతుంది అనేది అందరూ చెబుతున్న మాట. ఏది ఏమైనప్పటికీ మొదట్లో దాదాపు 60 Mbps గా ఉన్న డేటా స్పీడ్ ఇప్పుడు కేవలం 2-3 Mbps కి పడిపోయిందంటే ఏ స్థాయిలో ఏ స్పీడ్ తగ్గుదల ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి దాదాపు అందరు జియో వినియోగదారుల లోనూ నెలకొని ఉంది.
ఈ స్పీడ్ తగ్గడం తో పాటే జియో యొక్క స్పీడ్ ను ఎలా పెంచుకోవాలి అనే అంశంపై అనేక రకాల ఆర్టికల్ లు మరియు వీడియో లు సాంకేతిక సాహిత్యం లో వెల్లువలా వస్తున్నాయి. అవి ఎంతవరకూ జియో స్పీడ్ ను పెంచగలుగుతున్నాయో వాటిని ఉపయోగించేవారికే తెలియాలి. వాటికి మాదిరిగానే ఈ ఆర్టికల్ లో కూడా రిలయన్స్ జియో యొక్క స్పీడ్ ను బాగా పెంచుకునే ఒక అద్భుతమైన పద్దతిని అందిస్తున్నాం. జాగ్రత్తగా చదవండి. ఈ పద్దతిని మీ నెట్ వర్క్ కి మరియు స్మార్ట్ ఫోన్ కి అనువర్తించి చూడండి. అద్భుతమైన జియో స్పీడ్ ను అనుభవించండి.
మీ ఫోన్ ను రూటింగ్ చేయడం ద్వారా మీ జియో యొక్క స్పీడ్ ను పెంచుకునే విధానాన్ని ఇక్కడ అందిస్తున్నాం. ఈ రూటింగ్ ప్రక్రియ ను ఉపయోగించాలి అంటే మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయి ఉండాలి. అసలు రూటింగ్ అంటే ఏమిటి? దానిని ఎలా చేయాలి అనే విషయం పై మీకు కనీస అవగాహన లేకపోతే మాత్రం ఈ పద్దతిని పాటించకుండా ఉంటేనే ఉత్తమం. ఎందుకంటే రూటింగ్ అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియ. దీనివలన మీ స్మార్ట్ ఫోన్ కు ఏదైనా జరిగితే దానికి వారంటీ వర్తించక పోవచ్చు. కాబట్టి ఒక్కసారి ధైర్యం చేసి చూద్దాం అనుకుంటే మాత్రం తప్పకుండా దేనిని ఉపయోగించవచ్చు. మీరు గూగుల్ లో “ రూట్ స్మార్ట్ ఫోన్ మోడల్ “ ను టైపు చేస్తే దానిని ఎలా చేయాలో వివరాలు మీకు తెలుస్తాయి. ఉదాహరణకు మీరు రెడ్ మీ నోట్ 3 ని వాడుతూ ఉన్నట్లయితే “ రూట్ రెడ్ మీ నోట్ 3 అని టైపు చేయాలి.
ఈ పద్దతి లో మీ స్మార్ట్ ఫోన్ యొక్క సిగ్నలింగ్ వ్యవస్థకు కొన్ని కోర్ చేంజ్ లు చేయనున్నాము. ఈ క్రమం లో మీ ఫోన్ యొక్క జియో సిగ్నల్ శాశ్వతంగా కోల్పోవచ్చు, లేదా కొన్నిసార్లు ఫోన్ వేడెక్కి మంటలు రావచ్చు, కాబట్టి ముందే తెలియజేస్తున్నాము. దీనికి మా బాధ్యత లేదు. మీ పూర్తీ అంగీకారం తోనే దీనిని చేసుకోగలరు.
మీ స్మార్ట్ ఫోన్ లో నెట్ వర్క్ కోసం తయారుచేయబడిన బ్యాండ్ ను మార్చడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జియో ప్రస్తుతం ఇండియా లో మూడు రకాల స్పెక్ట్రమ్ లను ఉపయోగిస్తుంది. ది బ్యాండ్ 40 ( 2300MHz ), ది బ్యాండ్ 3 ( 1800 MHz ) , ది బ్యాండ్ 5 ( 850 MHz ) లు ప్రస్తుతం ఇండియాలో జియో ఉపయోగిస్తున్న స్పెక్ట్రమ్ బ్యాండ్ లు. స్పెక్ట్రమ్ లేదా బ్యాండ్ ను మీ స్మార్ట్ ఫోన్ తయారుచేయబడిన నెట్ వర్క్ స్థాయికి తగ్గట్లు మార్చుకోవడం వలన డేటా స్పీడ్ లో గణనీయమైన పెరుగుదల ను చూడవచ్చు. సాంకేతికంగా చూసుకుంటే బ్యాండ్ 40 ( 2300MHz ) అనేది మిగతా రెండు బ్యాండ్ లతో పోలిస్తే కొంచెం ఎక్కువ స్పీడ్ ను అందిస్తుంది. అయితే ఇది కూడా అన్ని సందర్భాలలో ఉండదు. నెట్ వర్క్ యొక్క ఏరియా ను బట్టి కూడా ఈ స్పీడ్ మారిపోతూ ఉండవచ్చు, మనం మన ఫోన్ ను ప్రతీ బ్యాండ్ కు లాక్ చేసుకుని ఏ ఏ బ్యాండ్ దగ్గర ఎంత స్పీడ్ వస్తుందో చెక్ చేసుకుని ఎక్కువ స్పీడ్ వస్తున్న బ్యాండ్ కు మన నెట్ వర్క్ ను సెట్ చేసుకోవచ్చు. ఇలా ఒక నిర్దిష్ట బ్యాండ్ కు మీ ఫోన్ ను లాక్ చేసుకోవాలి అంటే క్రింది ప్రక్రియ ను అనుసరించాలి.
బ్యాండ్ లను లాక్ చేయడం ద్వారా జియో స్పీడ్ పెంచడం ఎలా?
గమనిక: ఈ ప్రక్రియ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ తో పవర్ చేయబడిన స్మార్ట్ ఫోన్ లకు మాత్రమే వర్తిస్తుంది.
1. మీరు డ్యూయల్ సిమ్ ఫోన్ ను ఉపయోగిస్తున్నట్లయితే జియో ను ఎనేబుల్ చేసి వేరొక సిమ్ ను డిజేబుల్ చేయండి.
2. QTURN టెక్నాలజీస్ యొక్క నెట్ వర్క్ సిగ్నల్ గురు అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. ఇది ప్లే స్టోర్ లో లభిస్తుంది.
3. ఒక్కసారి ఈ ఓపెన్ యాప్ చేసిన తర్వాత రూట్ యాక్సెస్ చేయవలసిందిగా అడుగుతుంది. దానికి మీరు అంగీకారం తెలుపవలసి ఉంటుంది.
4. ఇది ఒక అద్భుతమైన డయాగ్నొస్టిక్ యాప్. మీరు ఏ బ్యాండ్ కు కనెక్ట్ అయి ఉన్నారో ఇది మీకు తెలియజేస్తుంది.
5. ఒక నిర్దిష్ట బ్యాండ్ కు లాక్ అవ్వాలి అంటే స్క్రీన్ పై భాగం లో ఉండే మ్యాజిక్ వాండ్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. అక్కడ సెలెక్ట్ బ్యాండ్ లాకింగ్ అనే దానిపై క్లిక్ చేయాలి. LTE ను సెలెక్ట్ చేసుకుని మీ స్మార్ట్ ఫోన్ ఏ బ్యాండ్ కు అయితే లాక్ చేయాలి అనుకుంటున్నారో ఆ బ్యాండ్ కు చెక్ చేసుకోవాలి.
6. ఆ బ్యాండ్ మీ ఫోన్ కు అందిస్తున్న స్పీడ్ అక్కడ మీకు చూపబడుతుంది. మీకు స్పీడ్ నచ్చితే దానిని సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే వేరే బ్యాండ్ ను చెక్ చేసుకోవాలి.
7. ఖచ్చితంగా ఈ మూడు బ్యాండ్ లలో ఏదో ఒక బ్యాండ్ కు మీ ఫోన్ అత్యధిక నెట్ వర్క్ స్పీడ్ ను అందిస్తుంది.