• తాజా వార్తలు

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌తో ల్యాండ్‌లైన్ క‌నెక్ష‌న్ ఫ్రీ

డీటీహెచ్ ఆప‌రేట‌ర్ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ స‌ర్వీస్ కూడా ప్రారంభించింది. ఇప్ప‌టికే బ్రాడ్‌బ్యాండ్ ఆఫ‌ర్ చేస్తున్న టెలికం కంపెనీలతో పోటీప‌డాల‌ని అనుకుంటోంది. అందుకే జియో, ఎయిర్‌టెల్ లాగే క‌స్ట‌మ‌ర్ల‌కు ఉచిత ల్యాండ్‌లైన్ ఫోన్ స‌ర్వీస్‌ను కూడా అందించ‌బోతుంది.

ఏయే ప్లాన్స్‌కి ఉచిత లాండ్‌ఫోన్ స‌ర్వీస్‌?

టాటాస్కైలో 1నెల‌, 3 నెల‌లు, 6 నెల‌లు, 12 నెల‌ల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ఉన్నాయి.

6 నెల‌లు, 12 నెల‌ల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ వాడేవారికి ల్యాండ్ ఫోన్ స‌ర్వీస్ ఫ్రీ

అదే 1 నెల‌, 3 నెల‌ల వారైతే ఎక్స‌ట్రా మ‌రో 100 రూపాయ‌లు క‌డితే ల్యాండ్‌లైన్ స‌ర్వీస్‌హ ఇస్తుంది. దీన్ని మంత్లీ రెంట‌ల్‌తో క‌లిపి తీసుకుంటుంది.

జియో, ఎయిర్‌టెల్‌లో అన్ని ప్లాన్స‌లోనూ ఫ్రీ

కానీ జియో, ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అన్నింటికీ ల్యాండ్‌లైన్ స‌ర్వీస్ ఉచిత‌మే.

జన రంజకమైన వార్తలు