• తాజా వార్తలు

మీ వాచ్చే మీ వాలెట్‌.. తొలి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వాచ్ టైటాన్ పే

ప‌ర్స్ తీసుకెళ్ల‌లేదు.. కార్డ్‌లూ ప‌ట్టుకెళ్ల‌లేదు.  ఏదైనా పేమెంట్ చేయ‌డం ఎలా?  స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, మొబీక్విక్ ఇలా ఏదో యాప్‌తో పే చేసేయొచ్చు.  ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా అక్క‌ర్లేదు.  మీ వాచీనే మీ వాలెట్‌గా మార్చేసుకోవ‌చ్చు. వాచీల త‌యారీలో ఇండియాలో ఎంతో పేరున్న టైటాన్‌.. టైటాన్ పే పేరుతో విడుద‌ల చేసిన ఈ వాచీ మ‌న దేశంలో తొలి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వాచ్‌గా ‌రికార్డుల‌కెక్కింది. పురుషుల‌కు, స్త్రీల‌కు వేర్వేరు మోడ‌ల్స్‌లో వీటిని లాంచ్ చేశారు. ధ‌ర రూ.2995 నుంచి రూ.5995 మధ్య ఉంటాయి.  

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కే ఫ‌స్ట్‌
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) క‌స్ట‌మ‌ర్ల‌కే ముందుగా ఈ టైటాన్ పే వాచ్ సేవ‌లు అంద‌బోతున్నాయి. ఎస్‌బీఐ యోనో యాప్‌తో లింక‌య్యే టైటాన్‌ పే వాచ్‌ల‌ను ఎస్‌బీఐ, టైటాన్‌పే క‌లిసి ఇటీవ‌ల మార్కెట్లోక‌ రిలీజ్ చేశాయి.  ఈ వాచ్‌తో ఎస్‌‌బీఐ కస్టమర్లు డెబిట్ కార్డు స్వైప్ చేయాల్సిన ప‌ని లేకుండా చేతికి ఉన్న టైటాన్‌ వాచ్‌ని టాప్‌ చేయడం ద్వారా పేమెంట్స్ చేసేయొచ్చు.  నియ‌ర్ ఫీల్డ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ (ఎన్ఎఫ్‌సీ) ద్వారా ఈ పేమెంట్ పూర్త‌వుతుంది. 

టైటాన్ పే ఎలా పని చేస్తుంది? 
* టైటాన్ పే వాచ్‌‌తో కాంటాక్ట్‌లెస్ పేమెంట్ చేయాలంటే కస్టమర్లు ముందుగా ఎస్‌బీఐ యోనో యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. 

* ఈ వాచ్‌ స్ర్టాప్‌లో  ఎన్ఎఫ్‌సీ చిప్ ఉంంటుంది. దీని సాయంతో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ పూర్త‌వుతాయి.  

* రూ.2000 వరకు చెల్లింపుల పేమెంట్స్‌కు అయ‌తే పిన్ కూడా ఎంట‌ర్ చేయ‌క్క‌ర్లేదు. ఆ అమౌంట్ కంటే ఎక్కువైతే పిన్ నెంబ‌ర్‌ను స్వైపింగ్ మిష‌న్‌లో ఎంట‌ర్ చేయాలి. 

 
 

జన రంజకమైన వార్తలు