కాలానుగుణంగా, సమయాన్ని బట్టి ఆండ్రాయిడ్ ఫోన్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. చిన్న పాటి మార్పులతో అప్ డేట్ అవుతూ అన్ని కంపెనీలు కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని టాప్ బ్రాండెడ్ ఫోన్లు రాబోతున్నాయి. మరి ఇలా విపణిలోకి వస్తున్న ఫోన్లలో టాప్ రేటెడ్ ఫోన్లు ఏమిటో వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందామా?
వివో జెడ్, వివో జెడ్ ఎక్స్ ప్రొ
వివో సిరీస్ లో భాగంగా మార్కెట్లోకి రాబోతున్న ఫోన్లలో వివో జెడ్, వివో జెడ్1 ఎక్స్ ప్రొ ఉన్నాయి. జెడ్ సిరీస్ విజయవంతం అయిన నేపథ్యంలో మరో రెండు కొత్త ఫోన్లను ఈ కంపెనీ రంగంలోకి దింపుతోంది. వీటిలో జెడ్ 1 ఎక్స్ ప్రొ మరో బడ్జెట్ ఫోన్ గా చెబుతున్నారు. దీనిలో 48 ఎంపీ జీఎం 1 సెన్సార్ తో పాటు ట్రిపుల్ కెమెరా సిస్టమ్, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ లాంటి ఆప్షన్లు ఉన్నాీయి. వివో జెడ్ ఫోన్లో కూడా దాదాపు ఇవే ఫీచర్లు ఉన్నాయి.
రెడ్ మి నోట్ 8
భారత్ దేశంలో విజయవంతమైన ఫోన్లలో రెడ్ మి ఒకటి. ఈ సిరీస్ లో చాలా ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఆ కోవకు చెందిందే రెడ్ మి నోట్ 8. ఇది అచ్చంగా రెడ్ మి 7 సిరీస్ ఫోన్లనే పోలి ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5 సపోర్టు కూడా ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ దీనిలో వాడారు. ట్రిపుల్ కెమెరా సిస్టమ్ అందుబాటులో ఉంది. మెయిన్ కెమెరా 48 ఎంపీ పిక్సల్ తో వస్తోంది. ఈ సిరీస్ లోనే రెడ్ మి నోట్ 8 ప్రొ కూడా వచ్చింది
రియల్ మి ఎక్స్ టీ
ప్రపంచంలోనే తొలిసారి 64 ఎంపీ కెమెరాతో వస్తోంది రియల్ మీ ఎక్స్ టీ ఫోన్. ప్రస్తుతం ఉన్న రియల్ మీ ఫోన్ల కంటే ఇది అప్ గ్రేడెడ్ వెర్షన్. దీనిలో క్వాడ్ కెమెరా సిస్టమ్ ఉంది. రియల్ మీ 5 సిరీస్ మాదిరిగానే దీనిలో మిగిలిన ఫీచర్లు ఉంటాయి. దీనిలో శాంసంగ్ జీడబ్ల్యూ ఎంపీ సెన్సార్ వాడారు. 1.6 మైక్రాన్ ఇండ్యుడివల్ పిక్సల్ సైజు క్రియేట్ చేయడం దీని ప్రత్యేకత. దీని ధర రూ.20 వేల వరకు ఉంటుంది.
వన్ ప్లస్ 7 టీ
వన్ ప్లస్ ఫోన్లలో చాలా సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి. తాజా వన్ ప్లస్ 7 ఎక్స్ టీ సిరీస్ కూడా వచ్చింది. 64 ఎంపీ కెమెరాతో ఇది వస్తోంది. ఇంత పెద్ద కెమెరాతో తయారు కావడం వన్ ప్లస్ కు ఇదే తొలిసారి. స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ చిప్ తో దీన్ని తయారు చేశారు. యూరోప్, నార్త్ అమెరికా కంటే ముందు భారత్లోనే దీన్ని రిలీజ్ చేశారు.