స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయిపోయాయి. డబ్బులున్నవాళ్లు యాపిల్ వాచ్ కొనుక్కుంటే ఆసక్తి ఉన్నా అంత పెట్టలేని వాళ్లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌లతో మురిసిపోతున్నారు. మూడు, నాలుగు వేల రూపాయల నుంచి కూడా బడ్జెట్ స్మార్ట్‌వాచెస్ మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటివాటిలో కొన్నింటి డిటైల్స్ మీకోసం..
1. అమేజ్‌ఫిట్ బిప్ లైట్ Amazfit BIP Lite
* అమేజ్‌ఫిట్ బిప్ లైట్ వాచ్.. ఓ మంచి బడ్జెట్ స్మార్ట్‌వాచ్. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 45 రోజులపాటు నడుస్తుంది.
* రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ లాంటి మీ డైలీ యాక్టివిటీస్ అన్నింటినీ ట్రాక్ చేస్తుంది.
* 3 ఏటీఎం సర్టిఫైడ్ స్మార్ట్‌వాచ్ ఇది. అంటే 30 మీటర్ల లోతు నీటిలో పడినా ఏమీ కాదు. కాబట్టి ఎండయినా, వానయినా దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు.
* ఎండలో కూడా కనిపించే డిస్‌ప్లే దీని సొంతం.
* ధర: 3,999.
2. నోయిస్ కంట్రోల్ ఫిట్ ప్రో ఫిట్‌నెస్ వాచ్ Noise ColorFit Pro Fitness Watch
* నోయిస్ కంట్రోల్‌ఫిట్ ప్రో ఫిట్‌నెస్ వాచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మంచి పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ లాంటివి ఆడేటప్పుడు పెట్టుకోవచ్చు.
* మీ హార్ట్‌రేట్‌ను 24 గంటలూ మానిటర్ చేస్తుంది.
* కెమెరాను,మ్యూజిక్ ప్లేయర్‌ను కంట్రోల్ చేయొచ్చు.
* టెంపరేచర్ వంటి వెదర్ అప్‌డేట్స్ తీసుకోవచ్చు.
* స్టాప్ వాచ్, బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్స్ ఉన్నాయి.
* బ్యాటరీ బ్యాకప్ 3 రోజులు వస్తుంది. స్టాండ్‌బై టైమ్ 12 రోజులు.
* ధర : 2,499 రూపాయలు
3. హానర్ మ్యాజిక్ వాచ్ Honor Magic Watch
* 1.2 అంగుళాల అమోల్డ్ కలర్ స్క్రీన్ డిస్‌ప్లే.
* మీ హార్ట్‌రేట్‌ను 24 గంటలూ మానిటర్ చేస్తుంది.
* కెమెరాను,మ్యూజిక్ ప్లేయర్‌ను కంట్రోల్ చేయొచ్చు.
* టెంపరేచర్ వంటి వెదర్ అప్‌డేట్స్ తీసుకోవచ్చు.
* ఏఎల్ఎస్ యాంబియంట్ లైట్.. బ్రైట్‌నెస్‌ను ఆటోమేటిగ్గా అడ్జస్ట్ చేస్తుంది.
* బ్యాటరీ బ్యాకప్ 7 రోజులు వస్తుంది.
* ధర : 9,999 రూపాయలు
4. అమేజ్‌ఫిట్ జీటీఎస్ స్మార్ట్ వాచ్ Amazfit GTS Smart Watch
* 1.65 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే. హైరిజల్యూషనే కాదు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అల్యూమినియం అల్లాయ్ మెటల్ బాడీ దీని ప్రత్యేకత
* 5 ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ సర్టిఫైడ్ స్మార్ట్‌వాచ్. అంటే 50 మీటర్ల లోతు నీటిలో పడినా ఏమీ కాదు. కాబట్టి ఎండయినా, వానయినా బేఫికర్.
* మీ హార్ట్‌రేట్‌ను 24 గంటలూ మానిటర్ చేస్తుంది.
* బ్యాటరీ బ్యాకప్ 14 రోజులు .
* ధర : 9,999 రూపాయలు
5. అమేజ్‌ఫిట్ హువామీ బిప్ టచ్ స్క్రీన్ స్మార్ట్ వాచ్ Amazfit Huami Bip Touch Screen Smartwatch
* మీ హార్ట్‌రేట్‌ను 24 గంటలూ మానిటర్ చేస్తుంది.
* స్లీప్‌ను, కేలరీలను లెక్క కడుతుంది.
* ట్రాక్ రన్స్, సైక్లింగ్ చేసేవారి మ్యాప్ రూట్స్, డిటైల్డ్ బాడీ స్టేటస్ చూపిస్తుంది.
* బ్యాటరీ బ్యాకప్ 45 రోజులు .
* ధర : 4,999 రూపాయలు
ఇవి కాక Echo Ultra Smart Fitness Watch (ధర 4,399), PlayFit SW75 Smartwatch (ధర 3,299) కూడా బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ల్లో మంచి ఆప్షన్స్