• తాజా వార్తలు

2020లో రానున్న క్రేజీ ఫోన్లు ఇవే!

స్మార్ట్‌ఫోన్‌... దీనికున్న క్రేజ్ ఇప్పుడు దేనికీ లేదు. ఈ సీజ‌న్లో కొనుక్కున్న ఫోన్ నెక్ట్ సీజ‌న్లో పాతబ‌డిపోతుంది. దీనికి కారణం కొత్త కొత్త ఫీచ‌ర్లు రావ‌డం.. అప్‌డేట్ కావ‌డం వ‌ల్లే. అందుకే ఇప్పుడు ఫోన్‌ను ఎవ‌రూ ఏడాది లేదా రెండేళ్ల‌కు మించి ఎవ‌రూ  వాడ‌ట్లేదు. కొత్త ఫీచ‌ర్ల కోసం, అప్‌డేష‌న్ కోస‌మే అంద‌రూ ఇష్ట‌ప‌డుతున్నారు.  కొత్త ఏడాదిలోనూ క‌స్ట‌మ‌ర్ల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా కొన్ని ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. మ‌రి అలా 2020 ఏడాదిలో ఇంట్రడ్యూస్ కాబోతున్న క్రేజీ ఫోన్లు ఏమిటో తెలుసుకుందామా!

రియ‌ల్‌మి 7, రియ‌ల్‌మి 7 ప్రొ
రియ‌ల్‌మి మ‌రో రెండు కొత్త ఫోన్లు మార్కెట్లోకి వ‌స్తున్నాయి.. రియ‌ల్‌మి 6 ఫోన్‌కు భార‌త్‌లో మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో ఆ శ్రేణికి చెందిన మ‌రో రెండు ఫోన్ల‌ను వ‌దులుతోంది రియ‌ల్‌మి. అవే రియ‌ల్‌మి 7, రియ‌ల్‌మి 7 ప్రొ. కొత్త ఏడాదిలో ఇవి క‌స్ట‌మ‌ర్ల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాయి. అయితే జ‌న‌వ‌రిలో రాక‌పోయినా.. ఏడాది మ‌ధ్య‌క‌ల్లా పూర్తి స్థాయిలో ఇవి వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానున్నాయి. పెంటా కెమెరా సిస్ట‌మ్‌, పంచ్ హోల్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ చిప్స్ లాంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్ల ప్ర‌త్యేక‌త‌.

రెడ్‌మి కే30 ప్రొ
ఇప్ప‌టికే రెడ్‌మి కె30 మార్కెట్లోకి రాగా.. ఆ సిరీస్‌లోనే మ‌రో ఫోన్‌ను బ‌రిలో దింపుతోంది రెడ్‌మి. అదే రెడ్‌మి కె30 ప్రొ. ఇది 2020లో మార్కెట్లోకి రాబోతోంది. రెడ్‌మి కే30 బాగా విజ‌య‌వంతం అయిన నేప‌థ్యంలో కె30ప్రొలోనూ మంచి ఫీచ‌ర్ల‌తో విప‌ణిలోకి తెచ్చేందుకు రెడ్‌మి ప్ర‌య‌త్నిస్తోంది. క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ చిప్‌, స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాఎస‌ర్ లాంటి ప్రిమియం ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.  ధ‌ర కూడా అందుబాటులో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  64 ఎంపీ మెయిన్ కెమెరా, పంచ్ హోల్ డిస్‌ప్లే లాంటి ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌11, ఎస్ 11 ప్ల‌స్‌
2020 ఏడాది వ‌చ్చే ఫోన్ల జాబితాలో శాంసంగ్ కూడా ముందంజ‌లో ఉంది.  ఈ కంపెనీ తెచ్చిన గెలాక్సీ సిరీస్ స‌క్సెస్ కావ‌డంతో ఆ సిరీస్‌లోనే మ‌రో రెండు కొత్త ఫోన్ల‌ను కొత్త ఏడాది బ‌రిలో దింపుతోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌11, ఎస్ 11 ప్ల‌స్ పేరుతో ఈ ఫోన్లు వ‌స్తున్నాయి. ఈ ఫోన్లు ఫిబ్ర‌వ‌రిలో రాబోతున్నాయి. డైన‌మిక్ డిస్‌ప్లే, క్వాడ్ హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్‌, 108 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ లాంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్ల‌లో ఉండ‌బోతున్నాయి.

 వ‌న్ ప్ల‌స్ 8, వ‌న్ ప్ల‌స్ 8 ప్రొ
కొత్త సంవ‌త్స‌రం మార్కెట్ బ‌రిలో వ‌న్‌ప్లస్ కూడా ఉండ‌బోతోంది. త‌న వ‌న్‌ప్ల‌స్ సిరీస్‌లో భాగంగా వ‌న్‌ప్ల‌స్ 8, వ‌న్ ప్ల‌స్ 8 ప్రొ ఫోన్ల‌ను తీసుకొస్తోంది ఈ సంస్థ‌. న్యూ పంచ్ హోల్ డిజైన్‌, పంచ్ హోల్ కెమెరా అప్ ఫ్రంట్ వితౌట్ పాప‌ప్ సెన్సార్‌, క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ఫీచ‌ర్లు దీనిలో ఉన్నాయి. 

ఇవి కూడా వస్తున్నాయ్‌

గూగుల్ పిక్స‌ల్ 5, గూగుల్ పిక్స‌ల్ 5 ఎక్స్ఎల్

శాంసంగ్ గెలాక్సీ నోట్ 11, గెలాక్సీ నోట్ 11 ప్ల‌స్‌

ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ

వ‌న్ ప్ల‌స్ 8 టీ, వ‌న్ ప్ల‌స్ 8టీ ప్రొ

రియ‌ల్‌మి ఎక్స్‌3, రియ‌ల్‌మి ఎక్స్‌3 ప్రొ

రెడ్‌మి నోట్ 9, రెడ్‌మి నోట్ 9 ప్రొ

జన రంజకమైన వార్తలు