• తాజా వార్తలు

వివిధ ఈ కామర్స్ సైట్లలో ఉన్న ధరల వ్యత్యాసాల్ని నిగ్గు తేల్చే వూడూ యాప్

వివిధ ఈ కామర్స్ సైట్లలో ఉన్న ధరల వ్యత్యాసాల్ని నిగ్గు తేల్చే "వూడూ" యాప్

ఆన్ లైన్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ రంగం లో విప్లవాత్మక మార్పులు వచ్చిన విషయం మనందరికీ తెలిసినదే. ఈ రోజు ఆన్ లైన్ లో షాపింగ్ చేయాలంటే అనేక అవకాశాలు. అమజాన్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్, జబంగ్, ఇలా ఒకటేమిటి ఈ ఆన్ లైన్ మార్కెటింగ్ సైట్ ల సంఖ్య పదుల సంఖ్య లో ఉన్నది. చాలా వరకూ ప్రతీ సైట్ కూడా దాని స్మార్ట్  ఫోన్ యాప్ లను విడుదల చేసేశాయి. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కానీ ఒక వినియోగదారుడు ఏదైనా వస్తువును ఆన్ లైన్ లో కొనుగోలు చేసినపుడు అది తక్కువ ధరకు లభించిందా లేక ఎక్కువ ధరకు కొని మోస పోయాడా అనేది తెల్సుకోవాలంటే ఎలా? ఏముంది మిగతా సైట్ లలో ఆ వస్తువులు ఏ ధరకు లభిస్తున్నాయో పోల్చి చూడడమే. మరి అలా పోల్చడం ఎలా? మీ కంప్యూటర్ లో ఒక డజన్ ట్యాబు లను ఓపెన్ చేసి ప్రటీ ట్యాబు లోనూ ఈ మార్కెటింగ్ సైట్ లన్నీ నింపేసి మనకు కావలసిన వస్తువు దేనిలో ఎంతకు దొరుకుతుందో చూసుకోవడమే కదా! కంప్యూటర్ లో అయితే ఇలా చేస్తారు. మరి మొబైల్ ఫోన్ లో ఎలా? మొబైల్ లో ఫోన్ లో కూడా షాప్ ఇన్ సింక్ లాంటి ప్రైస్ కంపారిజన్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని మీకు కావలసిన వస్తువును అందులో చూసుకొని బెస్ట్ డీల్ కోసం వెతకడమే. అలోచించి చూస్తే పైన చెప్పిన రెండు పద్దతులూ కొంచెం క్లిష్టత తో కూడుకున్నవే. అలా కాకుండా ఏదైనా వస్తువు ను మనకు కావాలి అనుకుంటే అది ఎక్కడ ఏ రేట్ కు దొరుకుతుందో ఇట్టే చెప్పేసే యాప్ ఒకటి ఉంటె భలే ఉంటుంది కదా! అవును అలాంటి సౌలభ్యం తో కూడినదే   వూడూ యాప్

ఈ వూడూ యాప్ మన ఫోన్ లో ఉంటె ఎదో ఒక మంత్రం దండం మన ఫోన్ లో ఉన్నట్లే అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. వెబ్ లో ఉండే బ్రౌజరు ఎక్స్ టెన్షన్ లా ఇది పనిచేస్తుంది. ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్సు యాప్, జోమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్, క్లియర్ ట్రిప్ లాంటి ట్రావెల్ యాప్ ఇలా ఏదైనా మీకు నచ్చిన ఒక యాప్ ను మీ ఫోన్ లో ఓపెన్ చేస్తే చాలు ఆ మంత్రం ఏమిటో మీకు కూడా కనిపిస్తుంది. అంటే మీరు ఏదైనా వస్తువు యొక్క వివరాలను లేదా ధరను ఒక వెబ్ సైట్ లో ఓపెన్ చేస్తే మీ ఫోన్ యొక్క స్క్రీన్ పైన ఆ వస్తువును మిగతా వెబ్ సైట్ లో ఎంత ధరకు అందిస్తున్నాయో నోటిఫికేషన్ లాగా కనపడుతుంది. ఒకవేళ మీరు కోరుకున్న వస్తువు మిగతా వెబ్ సైట్ లలో అందుబాటులో లేకపోతే దానిని పోలి ఉన్న వేరే వస్తువులను వాటి ధరలను మీకు చూపిస్తుంది. మీకు ఏది బెటర్ డీల్ అనిపిస్తే దానిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావలసిన దానిని కొనుక్కోవచ్చు. సేవింగ్స్ ను ఎంజాయ్ చేయవచ్చు.

ఉదాహరణకు మీరు ఒక కొత్త మొబైల్ కొనాలని అనుకోని స్నాప్ డీల్ ను ఓపెన్ చేసి వెతికితే, మోటో సెకండ్ జెన్ ఫోన్ ను సెలక్ట్ చేసారు అనుకుందాం. స్నాప్ డీల్ లో దీని ధర రూ 4,999/-  గా ఉంది అనుకుందాం. మీ స్క్రీన్ పై కనిపించే వూడూ బటన్ పై ట్యాప్ చేస్తే మిగతా సైట్ లు ఏ రేట్ కు అందిస్తున్నాయో తెలుస్తుంది. షాప్ క్లూస్ లో దీని ధర రూ 4599/- గానూ ఫ్లిప్ కార్ట్ లో రూ 5999 గానూ ఉన్నట్లు చూపిస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా రెండవ ఎంపిక నే ఎంచుకుంటాం. సిమిలర్ ప్రోడక్ట్ ల కు సంబందించిన సమాచారాన్ని కూడా ఇస్తుంది. ఉదాహరణకు జబంగ్ యాప్ లో మీరొక ప్రముఖ బ్రాండ్ షర్టు ను సెలక్ట్ చేసుకున్నారనుకోండి. వేరొక సైట్  లలో ఆ బ్రాండ్ లేకపోతే దానికి సిమిలర్ గా ఉండే ఉత్పత్తులను మీకు చూపిస్తుంది. అంటే మీ సెకండ్ ఒపీనియన్ ను కూడా ఈ యాప్ నే అందిస్తుందన్నమాట. ఇందులో ఇంకొక ప్రముఖమైన అంశం. క్యాబ్ లకు సంబందించినది. మీరు హైదరాబాద్ కు కొత్త గా వచ్చారు. రైల్వే స్టేషన్ నుండి అమీర్ పెట్ కి వెళ్ళాలి. క్యాబ్ లో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. వెంటనే మీ స్మార్ట్ ఫోన్ లో వోలా యాప్ ఓపెన్ చేసి క్యాబ్ బుక్ చేస్తున్నారనుకోండి. వెంటనే మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై రైల్వే స్టేషన్ ఉంది అమీర్ పెట్ కి ఉబెర్ క్యాబ్ లో అయితే ఎంత ఖర్చు అవుతుంది. వోలా, ఉబెర్ ఈ రెండింటిలో దీనిలో వెళితే ప్రయాణ సమయం తక్కువగా ఉంటుంది తదితర విషయాలన్నీ కనిపిస్తాయి. మీ సౌలభ్యాన్ని బట్టి మీరు సెలక్ట్ చేసుకోవచ్చు.

చాలా బాగుంది కదా! మరెందుకు ఆలస్యం వెంటనే వూడూ యాప్ నో డౌన్ లోడ్ చేసుకోండి.

 

జన రంజకమైన వార్తలు