• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో వ‌చ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ వివో వీ20 విశేషాలేంటో తెలుసా?

 ఆండ్రాయిడ్ లేట‌స్ట్ ఓఎస్ ఆండ్రాయిడ్ 11తో వివో వీ20 పేరుతో ఇండియాలో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.  ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో ఇండియాలో లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదే. దీని విశేషాలేంటో చూద్దాం.  

వివో వీ20  ఫీచర్లు
* 6.44అంగుళాల అమోల్డ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్  హాలో ఫుల్ వ్యూ డిస్‌ప్లే
*  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720 జీ ప్రాసెసర్‌
* ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌
* 8 జీబీ ర్యామ్
*  256 జీబీ వరకు స్టోరేజ్‌. 1టీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్  
కెమెరాలు
వెనుక‌వైపు మూడు కెమెరాలున్నాయి. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమ‌రాతోపాటు 8 ,2 మెగాపిక్సెల్స్‌తో మ‌రో రెండు కెమెరాలు ఇచ్చారు. ఇక సెల్ఫీ కెమెరా మ‌రో సూప‌ర్ ఫీచ‌ర్‌గా ఏకంగా 44 మెగా పిక్సెల్స్‌తో వ‌చ్చింది. ఆటోఫోక‌స్ దీనిలో మ‌రో మంచి ఫీచ‌ర్‌. 
బ్యాట‌రీ
4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

వివో వీ20 ధర 
* రెండు వేరియంట్లలో వివో వీ 20 ల‌భిస్తుంది. 
* 8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,990 
* 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,990
* ప్రీ-బుకింగ్స్ ఈరోజు నుంచి ప్రారంభ‌మ‌య్యాయి.  అక్టోబర్ 20 నుంచి సేల్ మోద‌ల‌వుతుంది.  
ఆఫ‌ర్లు ఏమున్నాయి?
* వీ-షీల్డ్ మొబైల్ ప్రొటెక్షన్ ద్వారా పాత ఫోన్ కొంటే వివో వీ 20పై రూ.2,500 అదనపు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ వ‌స్తుంది. 
* 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. 
* బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జెస్ట్ మనీ ద్వారా ఆఫ్ లైన్‌లో కొన్న‌వారికి కూడా 10% క్యాష్‌బ్యాక్ ఇస్తారు. 
* వీఐ(వొడాఫోన్ ఐడియా) 819 రీచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు ఎక్స్‌ట్రా వారంటీ కూడా ల‌భిస్తుంది.

జన రంజకమైన వార్తలు