ఇండియాలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తుండటంతో వివో ఈ రేంజ్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. డ్యూయల్ రియర్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై 12ఎస్‌ను లాంచ్ చేసింది. వాటర్‌డ్రాప్ తరహా డిస్‌ప్లే నాచ్ లాంటి ఫీచర‍్లతో ఈ ఫోన్ రావడం విశేషం.
వివో వై 12ఎస్ ఫీచర్లు
* 6.51 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే
* ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ 35 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
కెమెరాలు, బ్యాటరీ
*వెనుకవైపు డ్యూయల్ కెమరాలున్నాయి. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా దానికి సపోర్ట్‌గా 2 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
* ఇక వీడియో కాల్స్ , సెల్ఫీల కోసం ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
* 5000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు
ధర 10 వేలు
* వివో వై12 ఎస్ ధర 9,990 రూపాయలు.
* ఫాంటమ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ కలర్లలో లభిస్తుంది.
* వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటా క్లిక్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ కొనుక్కోవచ్చు.