ఇండియన్ టీవీ మార్కెట్‌లోకి కొత్త కొత్త ప్లేయర్స్ లాంచ్ అవుతున్నారు. ఇప్పటికే తక్కువ ధరలతో మంచి ఫీచర్లతో టీవీలు లాంచ్ చేసి ఓ సెపరేట్ యూజర్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్న వ్యూ (Vu) కంపెనీ లేటెస్ట్‌గా అల్ట్రా 4కే టీవీలను ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.
డిస్‌ప్లే
ఈ టీవీల్లో డిస్‌ప్లే హైలెట్ అని చెప్పుకోవాలి. అల్ట్రా ఎడ్జ్ 4కే డిస్‌ప్లే వీటిలో స్పెషల్. 3,840 x 2,160 పిక్సెల్స్‌తో ట్రూ డెప్త్ ఉన్న పిక్చర్ క్వాలిటీని అందిస్తున్నాయి. డైరెక్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లే, 440 నిట్స్ బ్రైట్‌నెస్ దీనిలో ఇతర ప్రత్యేకతలు. అల్ట్రా 4కే డిస్‌ప్లే కావడంతో పిక్చర్ చాలా క్వాలిటీగా, డెప్త్‌గా ఉంటుందని వ్యూ ప్రకటించింది.
సౌండ్
ఇక ఆడియో విషయానికి వస్తే వ్యూ అల్ట్రా 4కే టీవీల్లో డాల్బీ డిజిటల్ ప్లస్ డీటీఎస్ సౌండ్ ఉంది. వర్చువల్ ఎక్స్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ ఉండటంతో ఇంట్లో కూర్చుని టీవీ చూసేవారికి కూడా స్టేడియంలో కూర్చుని చూస్తున్న అనుభూతి కలుగుతుందని వ్యూ చెబుతోంది. ఈ అల్ట్రా 4కే టీవీల్లో 30 వాట్సా బాక్స్ స్పీకర్స్ రెండు ఉన్నాయి. స్టాండర్డ్, థియేటర్, స్పోర్ట్స్, మ్యూజిక్, లేట్‌నైట్ ఇలా డిఫరెంట్ సౌండ్ మోడ్స్ ఉన్నాయి.
టెక్నాలజీ
వ్యూ అల్ట్రా 4కే టీవీలు ఆండ్రాయిడ్ 9 (పై) ఓఎస్‌తో రన్నవుతాయి. అందువల్ల గూగుల్ యాప్స్‌ను వాడుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక వాయిస్ కంట్రోల్‌తోనూ టీవీని ఆపరేట్ చేయొచ్చు. ఇంగ్లీష్, హిందీ బాషల్లో వాయిస్ సెర్చ్, వాయిస్ అసిస్టెంట్ అందుబాటులో ఉన్నాయి. క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మాలీ 470 జీపీయూ, 2జీబీ ర్యామ్‌తో స్మార్ట్ టీవీ చాలా స్మూత్‌గా పని చేస్తుంది. 16జీబీ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉంది.
ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్
వ్యూ 4కే అల్ట్రా టీవీల్లో దాదాపు అన్ని ఓటీటీ యాప్స్ ప్రీ ఇన్‌స్టాల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యూట్యూబ్ స్ట్రీమింగ్ యాప్స్ టీవీతోపాటు ఇన్‌స్టాల్ చేసి ఇచ్చింది.
కనెక్టివిటీ
గూగుల్ క్రోమ్ కాస్ట్ , బ్లూటూత్ 5.0, వైఫై 802.11 ఏసీ, మూడు హెచ్‌డీఎంఏ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ ఇన్‌పుట్స్ , ఒక ఇయర్ ఫోన్ జాక్, ఆర్ ఎఫ్ అనలాగ్ పోర్ట్ , ఏవీ ఇన్‌పుట్ , ఎథర్నెట్ పోర్ట్ ఉన్నాయి.
నాలుగు సైజలు
వ్యూ అల్ట్రా 4కే టీవీలను 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల సైజ్‌ల్లో మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సైజ్‌ను బట్టి వీటి ధరలు 25,999 నుంచి 48,999 రూపాయల వరకు ఉంటాయని ప్రకటించింది.