దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ 2016లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ప్రస్తుతం ఫ్రీ రిపేర్‌ను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఆయా ఫోన్లలో వస్తున్న నో పవర్ అనే సమస్యనే.. ఈ కారణంగానే ఈ ఐఫోన్లను ఉచితంగా రిపేర్ చేసివ్వనున్నట్లు ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లలో నో పవర్ సమస్య కారణంగా ఆయా ఫోన్లు స్విచాన్ కావడం లేదని పలువురు వినియోగదారులు ఆపిల్ దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. అందుకు స్పందించిన ఆపిల్ ఆయా ఫోన్లను ఉచితంగా రిపేర్ చేసి ఇవ్వనున్నట్లు తెలిపింది.
2018 అక్టోబర్ నుంచి 2019 ఆగస్టు మధ్య తయారైన ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లలోనే ఈ సమస్య వస్తుందని ఆపిల్ తెలిపింది. కనుక వారికి మాత్రమే ఈ అవకాశాన్ని అందిస్తున్నామని కంపెనీ తెలియజేసింది. వినియోగదారులు ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాలంటే https://support.apple.com/en-in/iphone-6s-6s-plus-no-power-issues-program అనే సైట్‌ను సందర్శించి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది. అలాగే పైన తెలిపిన ఆ ఐఫోన్లు ఉన్న వారు ఆ సమస్యను ఎదుర్కొంటుంటే తమ ఫోన్లను ఈ ఆఫర్ కింద ఉచితంగా రిపేర్ చేయించుకోవచ్చో, లేదో కూడా ఈ సైట్లో తెలుసుకోవచ్చని ఆపిల్ తెలిపింది.