ఈ రోజుల్లో చాలామందిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఫోన్ చార్జింగ్, ఎంత ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్ అయినా ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండదు. ఇంటర్నెట్ వాడటం మొదలెడితే ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోయి ఒక్కోసారి చికాకు పుట్టిస్తుంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఈ శీర్షికలో భాగంగా ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మేలైన పవర్ బ్యాంకులు లిస్ట్ ఇస్తున్నాం. వాటిని జాగ్రత్తగా పరిశీలించి మీ అభిరుచికి అనుగుణంగా ఎంపిక చేసుకున్నట్లయితే ఛార్జింగ్ సమస్య తీరడంతో పాటు చాలా వరకు డబ్బు కూడా ఆదా అవుతుంది.
Mi 20000mAH Li-Polymer Power Bank 2i
దీని ధర రూ. 1,499
20,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో, లిథియం పాలిమర్ తో ఈ పవర్ బ్యాంక్ వచ్చింది. దీని ద్వారా రెండు మొబైల్స్‌ని ఒకేసారి ఛార్జింగ్ పెట్టినా దాదాపు 5.1V/3.6A అవుట్‌పుట్ వస్తుంది. 358 గ్రాముల బరువు ఉంటుంది. బ్లూటూత్ హెడ్‌సెట్స్, ఫిట్‌నెస్ డివైస్ లాంటి చిన్నపాటి గాడ్జెట్స్‌ను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ 4 గంటల 20 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఆయా డివైస్‌లు వేగంగా చార్జింగ్ అవుతాయి. అందుకు గాను ఈ పవర్ బ్యాంకుల్లో గరిష్టంగా 15 వాట్ల పవర్ ఔట్‌పుట్‌ను ఇస్తున్నారు. ఇక ఈ పవర్‌బ్యాంక్‌లపై 4 ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. ఇవి వాటిలో ఉన్న బ్యాటరీ చార్జింగ్‌ను సూచిస్తాయి.
Mi 10000mAH Li-Polymer Power Bank 2i
దీని ధర రూ. 899
10,000 ఎంఏహెచ్ సామర్థ్యం దీని ప్రత్యేకత. 240 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ యూఎస్‌బీ పోర్ట్ ఉండటం వల్ల ఒకేసారి రెండు ఫోన్లు ఛార్జ్ చేసుకోవచ్చు. 5v/2A, 9V/2A ఇన్‌పుట్‌ను సపోర్టు చేస్తూ..18 వాట్స్ అవుట్ పుట్‌ను అందిస్తుంది. ఈ పవర్ బ్యాంక్ 4 గంటల 20 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఆయా డివైస్‌లు వేగంగా చార్జింగ్ అవుతాయి. అందుకు గాను ఈ పవర్ బ్యాంకుల్లో గరిష్టంగా 15 వాట్ల పవర్ ఔట్‌పుట్‌ను ఇస్తున్నారు. ఇక ఈ పవర్‌బ్యాంక్‌లపై 4 ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. ఇవి వాటిలో ఉన్న బ్యాటరీ చార్జింగ్‌ను సూచిస్తాయి.
Lenovo 13000mAH Lithium-ion Power Bank
దీని ధర రూ.1099.
13,000ఎంఏహెచ్ సామర్థ్యం. బరువు కేవలం 281 గ్రాములు మాత్రమే. 5V ఇన్‌పుట్, 5V/2.1A, 5v/1A అవుట్‌పుట్ దీని ప్రత్యేకత. దీనికి కూడా రెండు యూఎస్‌బీ పోర్టులుంటాయి. దీని ద్వారా స్మార్ట్ ఫోన్లతో పాటు డిజిటల్ కెమెరా, టాబ్లెట్, ఇతర మీడియా ఉపకరణాలనూ ఛార్జ్ చేసుకోవచ్చు.
Anker PowerCore 10400mAh
దీని ధర రూ.2099
10400mAh సామర్థ్యం దీని సొంతం. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ PowerIQ and VoltageBoost వంటి ఫీచర్లు ఉన్నాయి. 2.4 amps per port or 3 amps దీని సొంతం. 18 నెలల వారంటీతో అందుబాటులో ఉంది.
Ambrane 13000 mAh Power Bank
దీని ధర రూ.899
13000mAh ఎంఏహెచ్ సామర్థ్యమున్న అంబ్రేన్ పవర్ బ్యాంక్‌లో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీనిలో 2 యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. LED Indicators, Mirco USB Input, and High-Quality Chipset వంటి ఫీచర్లు ఉన్నాయి. 1 ఇయర్ వారంటీతో లభిస్తోంది.
Zinq Technologies Z20KP 20000mAH
దీని ధర రూ.1199
20000mAh power bank
QC 3.0 support
2.4A charging
dual USB ports
black and white colors
Zoook PBS10E 10000mAH
దీని ధర రూ. 1729
10000mAh power bank. స్మాలెస్ట్ డిజైన్ తో వచ్చి లార్జెస్ట్ కెపాసిటిని ఇది కలిగి ఉంది. ఈ పవర్ బ్యాంక్ క్రెడిట్ కార్డు సైజులో ఉంటుంది. అయితే ఛార్జింగ్ మాత్రం 3 డివైస్ లకు సరిపోయేంతగా ఉంటుంది. 2.1a outputతో రావడం వల్ల ఛార్జింగ్ వేగం ఫాస్ట్ గా ఉంటుంది.