• తాజా వార్తలు

30 వేలలోపు ధరలో బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్‌టీవీలు ఎన్ని ?

ఇప్పుడు అంతా ఆండ్రాయిడ్ యుగం నడుస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లకు ధీటుగా మార్కెట్లోకి ఆండ్రాయిడ్  స్మార్ట్ టీవీలు వస్తున్నాయి.  Smart TV బిజినెస్ ని విస్తరించేందుకు దిగ్గ. కంపెనీలు న్నీ ఓకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఇప్పటికే షియోమి, శాంసంగ్, టీసీఎల్, వియు కంపెనీలు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. వీటికి పోటీగా OnePlus, Redmi బ్రాండ్ల నుంచి కూడా కొత్త Smart TVలు రానున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. హానర్ బ్రాండ్ కూడా ఇండియాలో కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ శీర్షికలో భాగంగా రూ. 30 వేలలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్‌టీవీల లిస్ట్ ను మీకు అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి. 

శాంసంగ్  (UA43N5010ARXXL) 2019 మోడల్ : 
రూ.29వేల 999 ధరకే ఈ Samsung large Smart TV సొంతం చేసుకోవచ్చు.  లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌తో ఉచితంగా Fire TV stick కూడా అందిస్తోంది. ఒక ఏడాది వరకు పూర్తి వారంటీని యూజర్లకు అందిస్తోంది. టీవీ ప్యానల్‌పై శాంసంగ్ ఒక ఏడాది వారెంటీ అందిస్తోంది. 43 అంగుళాలు Full HD (1920x1080 ఫిక్సల్), రీఫ్రెష్ రేట్ 60hertz , స్పోర్ట్స్ 20W స్పీకర్ సౌండ్ ఔట్ పుట్ ,2 HD పోర్టులు, 2 USB పోర్టులు, స్లిమ్ డిజైన్ 7.7cm థిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Xiaomi Mi LED Smart TV 4A Pro : 
రూ. 21వేల 999కు అందుబాటులో ఉంది. PatchWall (OS) ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ ఆండ్రాయిడ్ టీవీ రన్ అవుతుంది. స్ట్రీమింగ్ సర్వీసుల్లో Eors Now, Hungama play కంటెంట్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు.ఇందులో ChormeCast ఇన్ బుల్ట్ అయి ఉంటుంది. క్యాస్టింగ్ యాప్స్ WiFi, గూగుల్ వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్ ప్లాట్ ఫాంలను నేరుగా ఫోన్ నుంచి టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు.  Mi LED Smart TV 4A Pro టీవీపై ఒక ఏడాది వారంటీతో పాటు ప్యానల్ పై అదనంగా మరో ఏడాది వరకు వారంటీ అందిస్తోంది. 43 అంగుళాలు Full HD (1920x1080 ఫిక్సల్), 64bit క్వాడ్-కోర్ ప్రాసెసర్ ,1GB RAM, 8GB స్టోరేజీ, రీఫ్రెష్ రేట్ స్టాండర్డ్ 60Hz, స్పీకర్ ఔట్ పుట్ 20W, 3 HDMI పోర్టులు, 3 USB పోర్టులు వంటి ఫీచర్లు ఉన్నాయి. 

TCL P65 Series Full HD LED Smart TV (43S6500)
ఫ్లిప్ కార్ట్‌లో 3ఏళ్ల వారంటీతో రూ.24వేల 411 నుంచి అందుబాటులో ఉంది. 43 అంగుళాలు Full HD (1920x1080 ఫిక్సల్), 20W రెండు స్పీకర్లు సౌండ్ ఔట్ పుట్, 2 HDMI పోర్టులు, 1 USB పోర్ట్, ఆండ్రాయిడ్ బేసిడ్ యాప్స్ సపోర్ట్, 3 ఏళ్లు వారంటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Vu Full HD LED Smart TV (43D6575)
FlipKartలో Vu Full HD LED Smart TV టీవీ ధర రూ.24వేల 999కే అందుబాటులో ఉంది. Linux బేసిడ్ TV Vuలో PremiumSmart ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది. కానీ, Netflix, Hotstar స్ట్రీమింగ్ సర్వీసులు సపోర్ట్ చేయవు. Vu కంపెనీ డొమస్టిక్ వారంటీ ఏడాది వరకు ఆఫర్ చేస్తోంది. Wi-Fi ద్వారా స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్ ద్వారా స్ర్కీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. 43 అంగుళాల Full HD TV , 20W ఔట్ పుట్ స్పీకర్ Dolby డిజిటల్ సౌండ్, స్ర్కీన్ రెజుల్యుషన్ 1920 x 1080 pixels , రీఫ్రెష్ రేట్ 60Hz, 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, Screen mirroring సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

BPL Full HD LED TV (BPL109F2010J)
అమెజాన్ వెబ్ సైట్లో రూ.21వేల 990 నుంచి అందుబాటులో ఉంది.  బీపీఎల్ నుంచి ఒక ఏడాది వరకు వారంటీ అందిస్తోంది. 43 అంగుళాల Full HD TV డిస్ ప్లే (1920×1080 pixels), రీఫ్రెష్ రేట్ 60 hertz, 2 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, 1 VGA పోర్ట్, 16W ఇన్ బుల్ట్ స్పీకర్ ఔట్ పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

జన రంజకమైన వార్తలు