• తాజా వార్తలు

అంధుల కోసం గూగుల్ మ్యాప్‌లో సరికొత్త ఫీచర్ 

గూగుల్ మ్యాప్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. ఇది మనిషి జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది. కప్ కాఫీ ఆర్డర్ ఇచ్చినంత ఈజీగా నేవిగేషన్ ద్వారా మనం ప్రపంచాన్ని చుట్టేయవచ్చు. గూగుల్ కూడా ఎప్పటికప్పుడు యూజర్లు అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్లను జోడించుకుంటూ వస్తోంది. అయితే చూపులేని వారు గూగుల్ మ్యాప్ ని ఎలా ఉపయోగించుకుంటారు. అయితే వారికోసం సరికొత్త ఫీచర్ ని గూగుల్ మ్యాప్ లోకి తీసుకువస్తోంది. దీని ద్వారా చూపులేని వారు కూడా గూగుల్ మ్యాప్ ఉపయోగించుకోవచ్చు.

గూగుల్ మ్యాప్ టీం World Sight Day సంధర్భంగా చూపులేని వారికోసం గూగుల్ మ్యాప్ లో అదనంగా ఫీచర్ ని అనౌన్స్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా చూపులేని వారు కూడా అత్యంత ఈజీగా గూగుల్ మ్యాప్ ని వాడుకోవచ్చు. ‘‘వాయిస్ గైడెన్స్ ’’ ద్వారా వీరు గూగుల్ మ్యాప్ నుంచి తమకు కావాల్సిన దారిని వెతుక్కోవచ్చు. లీగల్ గా అంధత్వంతో ఉన్న టోక్యో బేస్ డ్ బిజినెస్ ఎనాలసిస్ట్  Wakana Sugiyama దీనికి నాయకత్వం వహించాడు. ఇతను ఇప్పుడు గూగుల మ్యాప్ టీంకి అడ్వయిజర్ గా ఉన్నాడు. అతని సహాయంతోనే గూగుల్ ఈ రకమైన ఫీచర్ ని తీసుకువచ్చింది. చూపులేని వారు తమ చుట్టుపక్కల పరిసరాలలో యథేచ్చగా తిరిగేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడింది. అలాగే ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి వెళ్లేందుకు, ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు ఈ గూగుల్ మ్యాప్ సహాయంతో ఈ ఫీచర్ చాలా సౌకర్యవంతంగా ఉంది. అయితే తెలియని ప్రదేశానికి  వెళితే మాత్రం కొంచెం భయపడే అనుభవం ఎదురయింది. అని అతను తన బ్లాగులో రాసుకున్నాడు. 
 
ఈ ఫీచర్ వాడుతున్న ఆమె‘‘ ఇంతకు ముందు నేను సరైన మార్గంలో వెళ్తున్నానా లేదా ఒక వీధి దాటడానికి సురక్షితంగా ఉందా అని తెలుసుకోవడం నాకు ఎప్పుడూ ఆందోళన కలిగించే అంశం అని ఆమె తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా "నేను సరైన సమయంలో వీధికి సరైన వైపున ఉన్నాను, మరియు నేను నా గమ్యస్థానానికి చేరుకున్నాను, లేదా నేను ఇప్పటికే దాటిపోయానా అని తెలుసుకుని నాకు నేను తరచుగా ఆశ్చర్యపోతున్నాను." అని తెలిపింది. కాగా ప్రపంచవ్యాప్తంగా అంధులైన 36 మిలియన్ల మందిలో సుగియామా ఉన్నారు. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే అదీ జపాన్ యుఎస్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా దీని మీద ప్రయోగం చేయాల్సి ఉంటుంది. అన్నీ పూర్తయిన తరువాత ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. 
 

జన రంజకమైన వార్తలు