ప్రపంచ నెంబర్‌వన్ యాపిల్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పునాది వేసుకుంటోంది. ప్రీమియం ఫోన్ల మార్కెట్లో యాపిల్ ఫస్ట్‌ప్లేస్‌కు వచ్చే అవకాశాలున్నాయని మార్కెట్ అంచనా. ఇప్పటికే నెంబర్‌వన్‌గా ఉన్న వన్‌ప్లస్‌ను వెనక్కినెట్టేసి యాపిల్ ఆ స్థానంలోకి రాబోతోంది.
8 లక్షల ఐ ఫోన్లు అమ్మేశారు
ఈ ఏడాది జూలై-సెప్టెంబరు వరకు మూడు నెలల్లో భారత మార్కెట్లో దాదాపు 8 లక్షల యాపి ల్ ఐఫోన్లు అమ్ముడయ్యాయని మార్కెట్ పరిశోధన సంస్థ కనాలిస్ చెబుతోంది. ఇండియాలోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్ (రూ.30వేలకు పైగా విలువ చేసే) మార్కెట్లో వన్‌ప్ల్‌సను వెనక్కి నెట్టి యాపిల్ అగ్రస్థానానికి చేరుకుందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అంటోంది. పండగ సీజన్‌లో ధరలు తగ్గించడంతో ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ 11 ఫోన్లు లక్షల్లో అమ్ముడయ్యాయి. అదే ఈ రికార్డుకు కారణం.
ఇండియాలో ఆల్‌టైమ్ హయ్యస్ట్ సేల్స్
ఇండియాలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఐఫోన్ సేల్స్ చూసి యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు ఇండియాలో ఆల్‌టైం హయ్యస్ట్ రికార్డు అని చెప్పారు.