రిలయన్స్ 42వ వార్షిక సమావేశంలో ముఖేష్అంబానీ కీలక ప్రకటనలు చేశారు. బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న గిగాఫైబర్ సేవలపై ఈ సమావేశంలో స్పష్టతనిచ్చారు. దీంతో పాటు జియఫోన్ 3 మీద కూడా క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 5న జియో గిగాఫైబర్ సేవలు కమర్షియల్ బేసిస్‌తో ప్రారంభం అవుతుందని, మరో 12 నెలల్లో జియో గిగాఫైబర్ సేవల్ని అందిస్తామని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ ముకేష్ అంబానీ ప్రకటించారు.
కాగా రిలయెన్స్ జియో 2018 ఆగస్ట్‌లోనే గిగాఫైబర్ సర్వీస్‌ను ప్రకటించింది. బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్‌ను ఒకే ప్యాకేజ్‌లో అందిస్తున్నామని జియో అధినేత ఈ సమావేశంలో తెలిపారు. గిగాఫైబర్ కోసం గతేడాదే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. 1600 పట్టణాల నుంచి 15 మిలియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా గిగాఫైబర్ సేవల్ని రిలయెన్స్ జియో అందిస్తోంది. దేశ వ్యాప్తంగా 20 మిలియన్ ఇళ్లకు గిగాఫైబర్ సేవలు అందించేలా రిలయెన్స్ జియో ప్రణాళికలు రూపొందిస్తోంది .
100 ఎంబీపీఎస్ స్పీడ్ నుంచి 1 జీబీపీఎస్ వరకు ప్లాన్స్ ఉంటాయి. రూ.700 నుంచి రూ.10,000 వరకు ప్లాన్స్ ధరలు ఉంటాయి. రిలయెన్స్ జియో గిగాఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారికి 1 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. అంటే సెకన్‌కు 1 జీబీ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. దీంతో పాటు ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్ సెటాప్ బాక్స్ ఉచితంగా లభిస్తాయి. అల్ట్రా హై డెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ గిగాఫైబర్‌తో సాధ్యమవుతుందని అంబానీ తెలిపారు.జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడవచ్చు.
మీటింగ్ హైలెట్స్ ఇవే
1. రిలయన్స్ జియోని 5జీగా అప్‌గ్రేడ్
2. ప్రతిఒక్కరికి అందుబాటులోకి డిజిటల్ నెట్‌వర్క్
3. సెప్టెంబర్ 5 నాటికి జియో ఆవిష్కరించి 3 మూడేళ్లు
4. త్వరలోనే అందుబాటులోకి జియో బ్రాడ్‌బ్యాండ్
5. 1600 పట్టణాల్లో 20 మిలియన్ల మందికి బ్యాడ్‌బ్యాండ్ కనెక్షన్లు
6. హోం బ్రాడ్ బ్యాండ్, 100జీబీ ఇంటర్నెట్, యూహెచ్‌డీ సెటాప్‌బాక్స్
7. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సర్వీసులు
8. రిలయన్స్ జియో ఫోన్ 3 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్
9. నాలుగు రకాల బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు
10. రిలయన్స్ బ్రాడ్ బ్యాండ్ జియోగిగా ఫైబర్‌గా కమర్షియల్‌గా లాంచ్