• తాజా వార్తలు

 నియర్ బై షేర్.. ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్త షేరింగ్ ఆప్షన్  

ఆండ్రాయిడ్ ఫోన్లలో సరికొత్త షేరింగ్ ఆప్షన్ తీసుకొచ్చింది గూగుల్. బ్లూటూత్, వైఫై వంటి కనెక్టింగ్ ఫీచర్లను ఉపయోగించుకొని సమీపంలో ఉన్న ఆండ్రాయిడ్ డివైస్ లకు ఫైల్స్ షేర్ చేసుకోవడానికి ఈ నియర్ బై షేరింగ్  ఫీచర్ ఉపయోగపడుతుంది. నియర్ బై షేరింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్తగా రాబోతుంది. ముందుగా గూగుల్ పిక్సెల్, సాంసంగ్ హై ఎండ్ ఫోన్లకు ఈ ఫీచర్ రానుంది. ఆండ్రాయిడ్ 6, ఆ తర్వాత వచ్చిన ఫోన్లకు ఈ ఫీచర్ పనిచేస్తుంది.      

ఎలా పనిచేస్తుందంటే? 

 ఏదైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి సెలెక్ట్ చేయగానే ఈ నియర్ బై షేరింగ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. బ్లూటూత్, వైఫై, బ్లూటూత్ లో ఎనర్జీ వంటి అందుబాటులో ఉన్న కనెక్టివిటీ ఫీచర్ల లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫైల్ షేర్ చేస్తుంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా ఈ నియర్ బై షేరింగ్ ఫీచర్ పనిచేస్తుంది. యాపిల్ ఎయిర్ డ్రాప్ లా ఐఫోన్, ఐ పాడ్ లాంటి యాపిల్ డివైజ్లకు దగ్గర్లో ఉన్న మరో యాపిల్ డివైస్ నుంచి ఫైల్స్ షేర్ చేయడానికి ఎయిర్ డ్రాప్ అనే ఫీచర్ ఉంది. 2011లో యాపిల్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ బాగా పాపులర్ అయింది. దాదాపు పదేళ్ల తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ లకు ఇలాంటి ఫీచర్ ను గూగుల్ తీసుకురావడం విశేషం.

జన రంజకమైన వార్తలు