• తాజా వార్తలు

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది... ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్క్రీన్ పై ఉన్న తొలి ఫోన్ రిలీజ్ చ

 * పది రోజుల కిందటే చెప్పిన కంప్యూటర్  విజ్ఞానం

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 చైనాలోని షాంఘైలో ఈ రోజు మొదలైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ జులై 1 వరకు కొనసాగుతుంది. కాగా తొలిరోజే వినూత్న టెక్ ఆవిష్కరణలకు ఇది వేదిక కావడం విశేషం. ప్రసిద్ధ మొబైల్ టెక్ సంస్థ క్వాల్ కామ్ తన నూతన ఫింగర్ ప్రింట్ సెన్సార్లను ఇందులో ప్రదర్శించింది.  స్ర్కీన్ పై ఫింగర్ ప్రింట్ సెన్సారు ఉన్న ఈ టెక్నాలజీని తొలిసారిగా వివో తన ఫోన్లో వాడింది... దీన్ని ఇక్కడ ఆవిష్కరించారు. వివో ఎక్స్ ప్లే 6 ఫోన్ లో దీన్ని ఉపయోగించడంతో ఇలాంటి టెక్నాలజీ వాడిన తొలి ఫోన్ గా ఇది గుర్తింపు పొందింది. 
    సాధారణంగా ఇప్పుడున్న అన్ని ఫోన్లలో ఫింగర్‌ ప్రింట్ సెన్సార్లు డివైస్ ముందు లేదా వెనుక భాగంలో ఓ ప్రత్యేకమైన బటన్ కింద ఉంటున్నాయి. దీంతో వీటిని ఎక్కువగా డివైస్‌లను అన్‌లాక్ చేసుకునేందుకు, పేమెంట్స్, యాప్, గ్యాలరీ లాక్ వంటి అప్లికేషన్స్ కోసం వాడుతున్నారు. అయితే ఇకపై అలా ప్రత్యేక బటన్ కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు లేకుండా ఫోన్ డిస్‌ప్లే కిందే వాటిని అమర్చుతూ క్వాల్‌కామ్ సరికొత్త సెన్సార్లను రూపొందించింది.
ఏమిటి వీటి ప్రత్యేకత
    వీటిని  'అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు'గా క్వాల్‌కామ్ పిలుస్తోంది. 2018 ఆరంభంలో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు ఉన్న ఫోన్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఫోన్ డిస్‌ప్లే కింద ఉన్నప్పటికీ యూజర్ ఫింగర్‌ప్రింట్‌ను కచ్చితత్వంతో స్కాన్ చేయగలవు. అదేవిధంగా అవి నీటిలో కూడా పనిచేయగలవు. యూజర్ హార్ట్ బీట్‌ను కూడా గుర్తించగలవు. ఈ ఫీచర్లన్నీ నూతనంగా రానున్న అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్లలో లభ్యం కానున్నాయి. దీని వల్ల డివైస్‌ను వాడడం తేలికవుతుందని, కొంత స్పేస్ కూడా కలసి వస్తుందని క్వాల్‌కామ్ చెబుతోంది.

ముందే చెప్పిన కంప్యూటర్  విజ్ఞానం
అయితే... వివో ఈ విషయంలో రికార్డు సృష్టిస్తుందని కంప్యూటర్  విజ్ఞానం పది రోజుల కిందటే చెప్పింది. దానికి సంబంధించిన స్టోరీ లింక్ ఇదీ...

http://computervignanam.net/article/Preview/FIRST-PHONE-WITH-AN-ON-SCREEN-FINGERPRINT-SENSOR-IS-FROM-VIVO/1926.cv

జన రంజకమైన వార్తలు