గత కొన్ని నెలలుగా చైనీస్ ఇంటర్ నెట్ స్టార్ట్ అప్ అయిన షియోమీ ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో నెంబర్ వన్ గా అవతరించింది. యూరోపియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ప్రకారం షియోమీ ఇండియన్ యూజర్ ల కోసం తన ప్రైవసీ పాలసీ ని అప్ డేట్ చేసి కొన్ని సరికొత్త క్లాజ్ లను అదనంగా యాడ్ చేసింది. షియోమీ యొక్క సరికొత్త ప్రైవసీ పాలసీ మే 25 నుండి అమలులోనికి వచ్చింది. ఈ నేపథ్యం లో షియోమీ ఫోన్ ను కానీ దీనియొక్క మి సర్వీస్ లను కొనుగోలు చేయాలనుకునే యూజర్ లు దీనియొక్క ప్రైవసీ పాలసీ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన 10 విషయాలను ఈ రోజు ఆర్టికల్ లో మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం అందిస్తున్నాం.
షియోమీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేస్తుంది.
ప్రైవసీ పాలసీ ప్రకారం మీ వ్యక్తిగత సమాచారం అయిన పేరు, వయసు, లింగం, పుట్టిన తేదీ మొదలైన వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. ఇది కేవలం సమాచార సేకరణ అని మాత్రమే చెబుతుంది కానీ మీ వివరాలను అప్ లోడ్ చేయవలసి ఉంటుంది.
మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది
మీరు కొన్న షియోమీ మొబైల్ లో సేవ్ చేసుకున్న మీ కాంటాక్ట్ నెంబర్ లు అన్నీ షియోమీ కలెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది.
మీ బ్యాంకు అకౌంట్స్ మరియు క్రెడిట్ డీటెయిల్స్ సేవ్ చేయవచ్చు.
Mi.com పై కానీ లేదా ఇతర షియోమీ ఫ్లాట్ ఫాం ల పై కానీ కొనుగులు చేసే లావాదేవీలన్నింటికీ చెందిన సమాచారం తప్పకుండా సేకరించాలని షియోమీ యొక్క ప్రైవసీ పాలసీ లో చాలా స్పష్టంగా రాసి ఉంది. అంటే మీ యొక్క బ్యాంకు ఎకౌంటు నెంబర్ , ఎకౌంటు హోల్డర్ పేరు, క్రెడిట్ కార్డు నెంబర్ మరియు ఇతర వివరాలను కూడా షియోమీ సేకరిస్తుంది.
మీ యొక్క ఉద్యోగ/పని వివరాలను కూడా సేకరిస్తుంది.
మీరు ఏం ఉద్యోగం చేస్తారు? ఎక్కడ చేస్తారు? మీ విద్యార్హత లు ఏమిటి? ప్రొఫెషనల్ ట్రైనింగ్ బ్యాక్ గ్రౌండ్ తదితర వివరాలన్నీ కూడా షియోమీ కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
మీ ఇంటి అడ్రస్ కూడా సేవ్ చేయబడుతుంది.
మీ ఇంటి యొక్క చిరునామా ను కూడా షియోమీ కలెక్ట్ చేసి సేవ్ చేస్తుంది.
పాస్ పోర్ట్, డ్రైవర్ లైసెన్స్ లాంటి ప్రభుత్వ ఐడి కార్డు లను కూడా సేవ్ చేస్తుంది.
షియోమీ యొక్క సరికొత్త పాలసీ ప్రకారం యూజర్ కు ఏవైనా ప్రభుత్వ ఐడి కార్డు లు ఉంటే అంటే పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివాటి సమాచారం కూడా కలెక్ట్ చేస్తుంది.
ఫోటో లు మరియు మి క్లౌడ్ లో ఉండే డేటా కూడా సేకరించబడుతుంది.
మి క్లౌడ్ లో యాజర్ లు సింక్ చేసే ఫోటో లు, కాంటాక్ట్ లిస్టు లు మరియు ఇతర డేటా ను కూడా షియోమీ యూజర్ ల వద్ద నుండి కలెక్ట్ చేస్తుంది.
డివైస్ మరియు సిమ్ సంబందిత సమాచారం కూడా స్టోర్ చేయబడుతుంది.
యూజర్ లకు యొక్క డివైస్ లకు చెందిన సమాచారం అయిన IMEI నెంబర్, IMSI నెంబర్, సీరియల్ నెంబర్, MIUI వెర్షన్ మరియు మిగతా సమాచారాన్ని షియోమీ కలెక్ట్ చేస్తుంది.
మీ లొకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా యాక్సెస్ చేసే అవకాశం ఉంది
కొన్ని సర్వీస్ లను అందించడానికి షియోమీ కంట్రీ కోడ్, సిటీ కోడ్, మొబైల్ నెట్ వర్క్ కోడ్, మొబైల్ కంట్రీ కోడ్, సెల్ ఐడెంటిటీ, లాంగిట్యూడ్ మరియు లాటిట్యూడ్ ఇన్ఫర్మేషన్, టైం జోన్ సెట్టింగ్స్ మరియు లాంగ్వేజ్ సెట్టింగ్స్ కు సంబందించిన సమాచారాన్ని కూడా సేకరిస్తుంది.
షేరింగ్ ఆప్షన్ ను స్టాప్ చేసే అవకాశం ఉంది కానీ..............
డేటా పాలసీ ని పారదర్శకంగా ఉంచేందుకు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను షియోమీ కి ఇచ్చేందుకు మీ అనుమతి ని తప్పనిసరి చేసింది. అంటే మీకు ఇష్టం లేకపోతే షేరింగ్ ఆప్షన్ ను ఆపుకోవచ్చు అయితే ఇకపై మీకు షియోమీ కి సంబందించిన అన్ని సర్వీస్ లనూ, ప్రోడక్ట్ లనూ ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు.